iDreamPost
android-app
ios-app

ఇంతకీ ‘పాగల్’ జోడి ఎవరు

  • Published Mar 27, 2020 | 8:55 AM Updated Updated Mar 27, 2020 | 8:55 AM
  • Published Mar 27, 2020 | 8:55 AMUpdated Mar 27, 2020 | 8:55 AM
ఇంతకీ ‘పాగల్’ జోడి ఎవరు

నాని నిర్మాతగా గత నెలలో విడుదలైన హిట్ సినిమా కమర్షియల్ లెక్కల్లో మంచి సక్సెస్ అందుకుందనే చెప్పాలి. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీని ఆ జానర్ లవర్స్ బాగానే లైక్ చేశారు. విశ్వక్ సేన్ కూ మంచి పేరు వచ్చింది. ఇటీవలే ఈ హీరో తన కొత్త సినిమా పాగల్ ని లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే . ఇందులో తనకు జోడిగా ఎవరు నటిస్తారనే విషయం మీద రకరకాల ఊహగాలను చెలరేగుతున్నాయి. మొన్నటి దాకా అను ఇమ్మనియేల్ పేరు వినిపించింది.

ఎప్పుడో అల్లు అర్జున్ నా పేరు సూర్య తర్వాత తెరపై కనిపించడం మానేసిన అనుకు సక్సెస్ లేకపోవడం పెద్ద శాపంగా మారింది. ఈ నేపధ్యంలో విశ్వక్ తో ఆఫర్ అంటే మంచి ఛాన్స్ గానే భావించవచ్చు. కాని దర్శక నిర్మాతల ఆలోచన వేరుగా ఉందట. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఉప్పెన భామ కృతి శెట్టిని ఆల్మోస్ట్ ఓకే చేసినట్టు తెలిసింది. మరి అను సంగతేంటి అంటే ప్రస్తుతానికి సమాధానం లేదు. ఉప్పెన ఇంకా విడుదల కానే లేదు. ఏప్రిల్ 2 ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ కరోనా వల్ల వాయిదా పడింది.

మే 7 అంటున్నారు కాని అప్పటికి పరిస్థితి కుదుటపడితే కాని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కాని ఉప్పెన తాలుకు ప్రోమోలు, లిరికల్ వీడియోలలో కృతి లుక్స్ కి అందరూ ఫిదా అయిపోయారు. మంచి లుక్స్ తో పాటు ఎక్స్ ప్రెషన్స్ కూడా లైవ్ గా ఉండటంతో డెబ్యు రిలీజ్ కాకుండానే కృతికి డిమాండ్ బాగా వచ్చిందట. గతంలో వచ్చిన అర్జున్ రెడ్డి, ఇడియట్ లను మిక్స్ చేస్తే ఎలా వస్తుందో ఆ టైపు క్యారెక్టరై జేషన్ పాగల్ లో విశ్వక్ సేన్ కోసం డిజైన్ చేశారట. రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యేలోపు హీరొయిన్ ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet