iDreamPost
android-app
ios-app

ఎవరీ సుదీష్ రాంబొట్ల ? ఇంగ్లీష్ మీడియం మీద ఎందుకు అంత కక్ష?

  • Published Apr 15, 2020 | 11:46 AM Updated Updated Apr 15, 2020 | 11:46 AM
ఎవరీ సుదీష్  రాంబొట్ల ? ఇంగ్లీష్ మీడియం మీద ఎందుకు అంత కక్ష?

రాజకీయాలనందు చంద్రబాబు మార్క్ రాజకీయం వేరయా అని భవిష్యత్తులో ఆయన రాజకీయ బాటని కేస్ స్టడిగా చూసుకునే విదంగా తయారయ్యారు 40ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు గారు. రాజకీయాల్లో ఆయన మ్యానేజ్ చేసినట్టుగా వ్యవస్థలను మరొకరు మ్యానేజ్ చేయలేరు అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. అన్ని రంగాల్లో, అన్ని పార్టీల్లో చంద్రబాబు కోసమే పనిచేసే వ్యక్తులు వేళ్లూనుకుపోయి స్లీపర్ సెల్స్ మాదిరి ఉన్నారు అనేది జగమెరిగిన సత్యం అయినా , ఎవరా వ్యక్తులు అనేది తలపండిన నేతలకే అంతుపట్టదు. చంద్రబాబు నుంచి స్లీపర్ సెల్ గా ఉన్న పలానా వ్యక్తికి ఆర్డర్ వచ్చే వరకు బయట పడరు. ఆయా సంస్థల్లోనో. పార్టీలోనో ఉంటూ వీరు చేసే పని నిత్యం చంద్రబాబు గారికి ఆయన రాజకీయ భవిష్యత్తుకి డోకా లేకుoడా చూడటమే.

చంద్రబాబు కి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనకుండే ఏకైక ఏజండా తన స్లీపర్ సెల్స్ ని ఉపయోగిస్తు ప్రభుత్వాన్ని పనిచేయనీయకుండా అడుగడుగునా అడ్డుపడటం. దానిలో భాగంగా వై.యస్ హయాంలో కూడా ఆంద్రప్రదేశ్ కి ప్రాణవాయువు లాంటి పోలవరం విషయంలో తన మనుషులని కోర్టుకు పంపి అడ్డుకునే ప్రయత్నం చేశారు, ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో కూడా తీరు మార్చుకోకుండా ప్రతిపక్షంలో ఉండి అదే విధంగా అన్ని ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డుపడుతూనే వస్తున్నారు, దీనికి సాక్షం తాజాగ జగన్ ప్రభుత్వం పేదవాడి జీవిత అభ్యుదయానికి ముడిపడి ఉన్న ఇంగ్లీష్ మీడీయం విద్యను తెస్తే దానిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న ఇంగ్లీష్ మీడీయం విద్య నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బిజేపి నేతగా చలామనీ అయ్యే చంద్రబాబు మనిషి సుధీస్ రాంబొట్ల వాజ్యం దాఖలు చేసి లక్షల మంది బడుగు బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తుపై దెబ్బ కొట్టారు.

ఏవరీ సుధీస్ రాంబొట్ల?

2000 సంవత్సరంలో సి.ఏ, లా విధ్యార్ధి అయిన శ్రీనివాస్ సుదీష్ రాంబొట్ల చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా కలర్ చిప్ అనే ఏనిమేషన్ సంస్థను స్థాపించారు. 2007లో మాయవతి నిర్వహించిన సర్వజన సమేళ్ళన ప్రభావంతో రాజకీయ ఆరంగేట్రం చేసి ఆ తరువాత చంద్రబాబుతో ఏర్పడిన పరిచయంతో 2009కి వచ్చేసరికి తెలుగుదేశం పార్టి తరుపున సికింద్రబాద్ పార్లమెంట్ స్థానం టికెట్టు సంపాదించారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైనా తెలుగుదేశం కోర్ థింక్ ట్యాంక్ టీమ్ లో ముఖ్యనేతగా ఉండి చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా మెలిగారు. సుదీష్ రాంబొట్లకి తనపై ఉన్న విదేయతకు బహుమతిగా చంద్రబాబు గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా టికెట్టు ఇచ్చారు. అయితే నామినేషన్ దాఖలు చేసేందుకు బయలుదేరిన సుధీష్ రాంభొట్ల ట్రాఫిక్‌లో చిక్కుకోవడం వల్ల ఆయన నిర్ణీత సయానికి వెళ్లలేక పోయారన్న కారణంగా ఎన్నికల అధికారులు రాంభొట్ల నామినేషన్‌ను తిరస్కరించారు. ఇక 2014లో ఆశించిన మల్కాజ్ గిరి టికెట్ దక్కకపోవటం పైగా రాష్ట్ర విభజన నేపద్యంలో రాజకీయ భవిష్యత్తు కోసం పార్టివీడినా తెలుగుదేశం మీద అభిమానం చంపుకోలేక పార్టిని వీడటం నాకు అత్యంత భాదకలిగిస్తున్న అంశం అని ఆనాడే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు.

ఇక తప్పక తెలుగుదేశం పార్టీ వీడుతునట్టు చెప్పి మా తండ్రిగారిది సంఘ్ భావజాలం అని బి.జే.పి లో చేరినా ఏనాడు తెలుగుదేశం మీద అభిమానం చంపుకోలేదు. ఆంద్రప్రదేశ్ బిజేపికి పెద్దదిక్కుగా ఉంటు చంద్రబాబుకి అత్యంత అప్తుడిగా మెలిగే ఒక ప్రముఖ వ్యక్తి అండతో అనతికాలంలోనే ఆంద్రప్రదేశ్ బిజేపి కి ముఖ్య అధికార ప్రతినిధి స్థానం సంపాదించుకున్నారు. ప్రత్యకహొదా మీద వై.యస్.ఆర్ కాంగ్రెస్ పోరాడుతుంటే వెంకయ్య నాయుడిని విమర్శిస్తే ఏ.పి కే నష్టం అంటు పరోక్షంగా పొత్తులో ఉన్న చంద్రబాబు ప్రభుత్వాన్ని కాపాడేలా ఒక రకమైన బెదిరింపు దోరణి అవలoబించారు.

ఐ.టి గ్రిడ్ స్కాం వ్యవహారంలో చంద్రబాబు ప్రధాని మోడీ పై రుద్దే ప్రయత్నం చేయగా , కేంద్ర బాజపా నాయకుల ఒత్తిడి మేరకు ఆ వ్యవహారంలో రాంబొట్ల ముకస్తుతిగా చంద్రబాబుని విమర్శించినా ఆ తరువాత చంద్రబాబుకు వత్తాసు పలికేలా అనేక సందర్బాల్లో వ్యవహరించారు. 2019 ఎన్నికల అనoతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగన్ ని పట్టుమని నెల గడవకముందే చంద్రబాబులా జగన్ కూడా ప్రతిపక్షంలో కూర్చుంటాడు అని పిల్లి శాపాలు పెట్టారంటే జగన్ ముఖ్యమంత్రి స్థానంలో ఉండటం ఆయనకు ఎంత బాదగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక తాజాగా ఇప్పుడు పేదవారి భవిష్యత్తుకి బాట వేసే ఆంగ్ల మాద్యమం పై విషం కక్కారు.

పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేందుకు ఆర్ధిక కారణాలతో ప్రైవేట్ స్కూల్స్ లో చదివించలేక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థులందరికి ఇంగ్లిషు మీడియం దోహదపడుతుందనే ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన ఈ విప్లవాత్మక సంస్కరణలకు ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆది నుండి అడ్డు పడుతూనే వస్తున్నారు. మొదట మండలిలో తన పశుబలం చూపి అడ్డుకున్నా చెల్లకపోయేసరికి సుదీష్ రాంబొట్ల లాంటి నేతల చేత కేసులు వేయించి పేదవాడి భవిష్యత్తు మీద కోలుకోలేని దెబ్బకొట్టారు. జగన్ ప్రభుత్వం పాఠశాలల్లో ఎన్నడూ లేని విదంగా తెలుగు సబ్జెక్టును అన్ని స్కూళ్లలో తప్పనిసరి చేసినా విద్యాలయల్లో తెలుగు మీడియం వుండాలి అని ప్రభుత్వం మీదకు పంతానికి దిగారు , ఇలా పంతానికి దిగిన సుదీష్ రాంబొట్ల , చంద్రబాబు , ఇతర నేతల పిల్లలు మాత్రం ఇంగ్లీషు మీడీయంలోనే చదవడం గమనార్హం.