iDreamPost
android-app
ios-app

ఇంతకీ మిస్టర్ ‘వి’ ఎవరు

  • Published Jan 27, 2020 | 6:48 AM Updated Updated Jan 27, 2020 | 6:48 AM
  • Published Jan 27, 2020 | 6:48 AMUpdated Jan 27, 2020 | 6:48 AM
ఇంతకీ మిస్టర్ ‘వి’ ఎవరు

సున్నితమైన భావోద్వేగాలను తెరకెక్కించడంలో పేరు తెచ్చుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందిస్తున్న చిత్రం వి . న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో సుధీర్ బాబు హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ఇవాళ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న సుధీర్ బాబు ఎవరినో వెతుకుతున్నట్టు చూస్తున్న కళ్ళలో ఇంటెన్సిటిని బట్టి చెప్పొచ్చు. బహుశా అది నాని కోసమే వేట అయ్యుంటుంది.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో నాని నెగటివ్ షేడ్స్ ఉన్న ఒక డిఫరెంట్ రోల్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అలా అని విలన్ కాదు. ఒక సదుద్దేశంతో నేరాలు చేసే వ్యక్తిగా చాలా విభిన్నంగా ఉంటుందని ఇప్పటికే వినిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే నానిని ఎన్నడూ చూడని పాత్రలో చూడొచ్చు. ఇంద్రగంటి నానికి మొదటి బ్రేక్ ఇచ్చిన దర్శకులు. అష్టా చెమ్మ తర్వాత నానికి వెనుదిరిగి చూడాల్సిన అవసరం పడలేదు. ఆ తర్వాత ఈ ఇద్దరూ జెంటిల్ మెన్ చేస్తే అది కూడా మంచి సక్సెస్ అందుకుంది.

ఇప్పుడీ వి మూడోది. ఖచ్చితంగా హ్యాట్రిక్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. ఇదే దర్శకుడితో సుధీర్ బాబు సమ్మోహనం రూపంలో ఇంతకు ముందే హిట్ అందుకున్నారు. అదితి రావు హైదరి, నివేదా థామస్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, నాజర్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అవసరాల శ్రీనివాస్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సైరా ఫేమ్ అమిత్ త్రివేది సంగీతం సమకూరుస్తున్నారు. ఇంతకీ వి ఎవరా అని మీ సందేహమా. ఇంకెవరు నానినే. ఇందులో అతని పాత్ర పేరు విక్రమాదిత్య. అది సంగతి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetBetsmovefixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş