iDreamPost
iDreamPost
రిలయన్స్ రిటైల్ కు కొత్త బాస్, ఛైర్ పర్సన్ గా ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ నియమితులైయ్యారు. ఆమె కవల సోదరుడు ఆకాష్ జియోకి ఛైర్మన్‌గా నియమితులైన ఒక రోజు తర్వాత,
రిలయన్స్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. ఇకమీద ఇషా, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెల్ వ్యాపార వ్యవహారాలను చూస్తారు.
ఇషా అంబానీ వయస్సు 30 ఏళ్లు. యేల్ యూనివర్సిటీలో సైకాలజీ చదివారు. ఆ తర్వాత , స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో MBA చేశారు. ముఖేష్ అంబానీ పర్యవేక్షణలో రిలయన్స్ సంస్థలో కీలక వ్యవహారాలను చక్కబెట్టడానికి , US నుండి తిరిగి వచ్చే ముందు, మెకిన్సే & కంపెనీలో కొంతకాలం బిజినెస్ అనలిస్ట్ గా పనిచేశారు. రియలన్స్ లో ప్రతిష్టాత్మక సంస్థలు పెట్టుబడులు పెడుతున్న వేళ, సోదరినితో కలసి ఆ వ్యవహారాల్లో చురుగ్గా పనిచేశారు.
పిరమల్ గ్రూప్‌కు చెందిన అజయ్ , స్వాతి పిరమల్‌ల కుమారుడు ఆనంద్ పిరమల్‌ను ఇషా అంబానీ పెళ్లిచేసుకున్నారు. ఈ వేడుకకి దేశంలో ప్రముఖులు హాజరైయ్యారు. సోదరుడు ఆకాష్ అంబానీ జియో ఛైర్మన్, ఇషా అంబానీ రిలయన్స్ రిలైట్ కి ఛైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టినవేళ, రిలయన్స్ వ్యాపార నాయకత్వ మార్పిడి ప్రక్రియను దేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది.
2008లో ఫోర్బ్స్ రూపొందించిన ‘పిన్న వయస్కుడైన బిలియనీర్ వారసురాలు’ జాబితాలో ఇషా అంబానీది రెండో స్థానం. ఆనాటి ఆస్తులు ₹ 471 కోట్లుగా ఫోర్బ్స్ అంచనావేసింది.
డిసెంబర్ 2015లో, ఇషా తన కవల సోదరుడు ఆకాష్ అంబానీ, బ్రాండ్ అంబాసిడర్ షారూఖ్ ఖాన్ ,AR రెహమాన్ సమక్షంలో, కంపెనీ ఉద్యోగులకు Jio 4G సేవలను పరిచయం చేశారు.
ఇక రియలన్స్ రిటైల్ అనుబంధ సంస్థ AJIO ఆన్ లైన్ ఫ్యాషన్ రిటైలర్ ప్రారంభం వెనుక ఇషా అంబానీ ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రిటైల్ బిజినెస్ రంగాన్ని ఇషా అంబానీ ప్రపంచ వ్యాప్తంగా సంస్థలను స్టడీచేశారు. అమెజాన్ ను మంచి సంస్థను తీర్చిదిద్దాలన్నది ఇషా ఉద్దేశమని బిజినెస్ సర్కిల్స్ లో వినిపించే మాట.