iDreamPost
android-app
ios-app

Jio Cloud Storage: గూగుల్, యాపిల్ కంపెనీలకు జియో షాక్.. తగ్గనున్న క్లౌడ్ స్టోరేజ్ ధరలు

  • Published Sep 01, 2024 | 3:30 AM Updated Updated Sep 01, 2024 | 3:30 AM

Mukesh Ambani Good News To Android, iPhone Users: అటు ఆండ్రాయిడ్ యూజర్స్ కానీ, ఇటు యాపిల్ యూజర్స్ కానీ ఒక విషయంలో బాగా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందులను తొలగించేలా ముఖేష్ అంబానీ వేసిన స్కెచ్ ఇప్పుడు యాపిల్, ఆండ్రాయిడ్ యూజర్స్ పాలిట వరంగా.. ఆ కంపెనీలకు శాపంగా మారనుంది.

Mukesh Ambani Good News To Android, iPhone Users: అటు ఆండ్రాయిడ్ యూజర్స్ కానీ, ఇటు యాపిల్ యూజర్స్ కానీ ఒక విషయంలో బాగా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందులను తొలగించేలా ముఖేష్ అంబానీ వేసిన స్కెచ్ ఇప్పుడు యాపిల్, ఆండ్రాయిడ్ యూజర్స్ పాలిట వరంగా.. ఆ కంపెనీలకు శాపంగా మారనుంది.

Jio Cloud Storage: గూగుల్, యాపిల్ కంపెనీలకు జియో షాక్.. తగ్గనున్న క్లౌడ్ స్టోరేజ్ ధరలు

ఆ మధ్య ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ గూగుల్ మ్యాప్స్ సేవల నుంచి నిష్క్రమించి గూగుల్ కి సడన్ షాక్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో గూగుల్ కి ఏటా 100 కోట్ల రూపాయల మేర ఓలా వల్ల వచ్చే లాభమంతా నష్టంలా మారిపోయింది. భవిష్ అగర్వాల్ గూగుల్ మ్యాప్స్ ని కాదని సొంతంగా ఓలా మ్యాప్స్ ని డెవలప్ చేసుకుంటున్నట్లు చెప్పడమే కాకుండా తోటి ఐటీ నిపుణులను కూడా ఓలా మ్యాప్స్ ని వినియోగించుకోవాలని కోరారు. దీంతో గూగుల్ మ్యాప్స్ దిగొచ్చింది. 70 శాతం ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. భారత్ లో ఉన్న కస్టమర్స్ ని పోగొట్టుకోకూడదని ధరలను భారీగా తగ్గించింది. తాజాగా ముఖేష్ అంబానీ సైతం గూగుల్, యాపిల్ కంపెనీలకు భారీ షాక్ ఇచ్చారు.

యాన్యువల్ జనరల్ మీటింగ్ 2024లో భాగంగా జియో క్లౌడ్ స్టోరేజ్ ని 100 జీబీ వరకూ వెల్కమ్ ఆఫర్ కింద ఉచితంగా అందించాలని నిర్ణయించింది కంపెనీ. దీపావళి నుంచి ఆ ఉచిత క్లౌడ్ స్టోరేజ్ ఆఫర్ ను అందించనున్నారు. దీంతో గూగుల్, యాపిల్ కంపెనీలకు భారీ ఎదురుదెబ్బ తగలడం ఖాయమని విశ్లేషకులు భవిస్తున్నారు. జియో క్లౌడ్ స్టోరేజ్ ఎంట్రీతో ఈ విభాగంలో గూగుల్ వన్, ఐక్లౌడ్ స్టోరేజ్ ధరలను గూగుల్, యాపిల్ కంపెనీలు తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎందుకంటే ఇటు ఆండ్రాయిడ్ యూజర్లు గానీ అటు యాపిల్ యూజర్లు గానీ విపరీతమైన స్టోరేజీ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆండ్రాయిడ్ యూజర్స్ లో ఎక్కువ మంది గూగుల్ ఉచితంగా ఇచ్చే 15 జీబీ డేటాను వాడుకుంటున్నారు.

ఈ పరిమితి దాటితే గూగుల్ వన్ లో అదనంగా స్టోరేజ్ ని కొనుగోలు చేస్తున్నారు. గూగుల్ వన్ లో 100 జీబీ స్టోరేజ్ కావాలంటే నెలకు రూ. 130 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఐక్లౌడ్ స్టోరేజ్ అయితే 50 జీబీ స్టోరేజ్ కి నెలకు రూ. 75 చెల్లించాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో జియో 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్ ని వెల్కమ్ ఆఫర్ లో భాగంగా ఫ్రీగా అందజేస్తున్నామని అన్నారు. రిలయన్స్ 47వ వార్షిక సాధారణ సమావేశంలో భాగంగా అంబానీ క్లౌడ్ సేవల గురించి ప్రస్తావించారు. ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు వంటి డిజిటల్ కంటెంట్ ను జియో యూజర్స్ స్టోర్ చేసుకునేలా జియో క్లౌడ్ స్టోరేజ్ ని తీసుకొస్తున్నట్లు అంబానీ తెలిపారు. వెల్కమ్ ఆఫర్ కింద 100 జీబీ వరకూ ఫ్రీ స్టోరేజ్ ని వాడుకోవచ్చునని.. ఇంకా ఎక్కువ స్టోరేజ్ కావాలంటే కనుక అందుబాటు ధరల్లోని అందిస్తామని అన్నారు.

దీంతో ఇప్పుడు గూగుల్, యాపిల్ కంపెనీలకు భారీ షాక్ ఇచ్చినట్లయ్యింది. 100 జీబీ డేటా ఫ్రీగా ఇవ్వడమే కాకుండా.. ఇంకా ఎక్కువ స్టోరేజ్ కావాలనుకునేవారికి తక్కువ ధరకే ఇస్తామని చెప్పడంతో ఇప్పుడు గూగుల్, యాపిల్ సంస్థల గుండెల్లో గుబులు మొదలైంది. దీంతో ఈ కంపెనీలు కూడా ధరలు తగ్గించడం కానీ లేదా ఎక్కువ క్లౌడ్ స్టోరేజ్ ని అందించడం గానీ చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ధరలు ఆ మధ్య ఓలా సీఈఓకి చెందిన ఓలా క్యాబ్స్ సంస్థ మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ సేవలతో డీల్ రద్దు చేసుకుంది. ఆ తర్వాత గూగుల్ మ్యాప్స్ తో ఒప్పందం రద్దు చేసుకుంది. అయితే గూగుల్ మ్యాప్స్ పోటీని తట్టుకునేందుకు ధరలను తగ్గించింది.

ప్పుడు మరోసారి క్లౌడ్ స్టోరేజ్ విషయంలో యాపిల్, గూగుల్ సంస్థలు దిగి వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు డేటా కొనాలన్నా, ఫోన్ రీఛార్జ్ చేయాలన్నా భారీగా చెల్లించాల్సి వచ్చేది. అటువంటి పరిస్థితి నుంచి జియోతో ఒక విప్లవాన్ని సృష్టించిన ముఖేష్ అంబానీ.. ఇప్పుడు జియో క్లౌడ్ స్టోరేజ్ తో మరో విప్లవానికి తెర తీశారు. అప్పట్లో రీఛార్జ్ ధరలు అందుబాటులోకి వచ్చినట్టే ఇప్పుడు కూడా క్లౌడ్ స్టోరేజ్ విషయంలో ధరలు తగ్గుతాయని అంటున్నారు. అదే జరిగితే ఆండ్రాయిడ్, యాపిల్ యూజర్ల కష్టాలు తీరతాయి. ముఖ్యంగా ఐక్లౌడ్ స్టోరేజ్ సరిపోక ఇబ్బందులు పడుతున్న యాపిల్ యూజర్లకి భారీ ప్రయోజనం చేకూరనుంది. జియో సిమ్ ఉన్నట్లయితే కనుక ఇటు జియో క్లౌడ్ స్టోరేజ్ ని, ఇటు యాపిల్ క్లౌడ్ స్టోరేజ్ ని రెండిటి విషయంలో ప్రయోజనాలు పొందవచ్చు. ఏది ఏమైనా గానీ అంబానీ తీసుకున్న నిర్ణయంతో యూజర్స్ కి భారీ ప్రయోజనాలు చేకూరనున్నాయి.