Dharani
Hurun India Rich List 2024-Gautam Adani: హిండెన్ బర్గ్ దెబ్బతో కాస్త వెనకపడ్డ గౌతమ్ అదానీ మళ్లీ పుంజుకున్నారు. సంపదలో ముఖేష్ అంబానీని దాటేశారు. ఆ వివరాలు..
Hurun India Rich List 2024-Gautam Adani: హిండెన్ బర్గ్ దెబ్బతో కాస్త వెనకపడ్డ గౌతమ్ అదానీ మళ్లీ పుంజుకున్నారు. సంపదలో ముఖేష్ అంబానీని దాటేశారు. ఆ వివరాలు..
Dharani
భారతదేశంలో అత్యంత ధనవంతుడు అనగానే వెంటనే ముఖేష్ అంబానీ పేరు చెబుతాం. ఆ తర్వాత స్థానం గౌతమ్ అదానీది. హిండెన్ బర్గ్ రిపోర్ట్ రాకముందు వరకు ఇండియా కుబేరుడు అనగానే గౌతమ్ అదానీ పేరు వినిపించేది. అయితే హిండెన్ బర్గ్ దెబ్బకు గౌతమ్ అదానీ సంపద ఆవిరి అయ్యింది. దాంతో అప్పటి వరకు ఇండియాలోనే అత్యంత ధనవంతడుగా ఉన్న గౌతమ్ అదానీ రెండో స్థానానికి పడిపోయారు. ముఖేష్ అంబానీ ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నారు. కానీ ఇప్పుడు ఆపరిస్థితి మారింది. సంపద విషయంలో గౌతమ్ అదానీ.. అంబానీని దాటేశారు. మరోసారి ఇండియాస్ రిచ్చెస్ట్ పర్సన్ జాబితాలో ప్రథమ స్థానంలోకి వచ్చేశారు. మరి ఇది ఏలా జరిగింది.. ప్రస్తుతం ఆయన సంపద ఎన్ని లక్షల కోట్లంటే…
దిగ్గజ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ మరోసారి భారత్‌లోని కుబేరుల జాబితాలో అగ్ర స్థానాన్ని దక్కించుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రెండో స్థానానికి పడిపోయ్యారు. కేవలం ఒక్క ఏడాదిలోనే అదానీ సంపద రెట్టింపు అయ్యింది అని నివేదిక తెలిపింది.. ఈ మేరకు హురూన్ ఇండియా రిచ్ లిస్ట్‌ను విడుదల చేసింది.
ఈ నివేదికలో ఉన్న దాని ప్రకారం చూసుకుంటే.. ఈ 5 సంవత్సరాల కాలంలో భారత్‌లో బిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం దేశంలో 334 మంది బిలియనీర్లు ఉన్నట్లు నివేదిక తెలిపింది. గత ఏడాదిలోనే ఏకంగా 29 శాతం మంది బిలియనీర్లుగా అవతరించినట్లు తెలిపింది. మరోవైపు.. చైనాలో బిలియనీర్ల సంఖ్య 25 శాతం మేర పడిపోయినట్లు నివేదికలో చెప్పుకొచ్చొంది.
హురూన్ ఇండియా బిలియనీర్ల జాబితాలో గౌతమ్ అదానీ ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు. ఏడాది కాలంలోనే ఆయన సంపద ఏకంగా 95 శాతం పెరిగినట్లు నివేదిక తెలిపింది. దీంతో ఇప్పుడు గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద విలువ రూ. 11.61 లక్షల కోట్లుగా పేర్కొంది. దీంతో ఆయన అగ్రస్థానంలోకి వెళ్లినట్లు పేర్కొంది. ఇక ముకేశ్ అంబానీ రూ. 10.14 లక్షల కోట్లతో రెండో స్థానంలో నిలిచినట్లు పేర్కొంది. ఆ తర్వాత హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత శివ్‌నాడార్, ఆయన కుటుంబం రూ.3.14 లక్షల కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ అధినేత సైరస్ పూనావాలా నాలుగో స్థానంలో నిలవగా.. సన్‌ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ ఐదో స్థానంలో నిలిచారు.
గతంలో ఈ జాబితాలో కేవలం వ్యాపార వేత్తలు మాత్రమే ఉండేవారు. ఈ సారి మాత్రం ఈ జాబితాలో సినీ రంగానికి చెందిన వారు కూడా చోటు సంపాదించున్నారు. సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తొలిసారి బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇక ఈ జాబితాలో చేరిన సినీ ప్రముఖుల్లో జుహీ చావ్లా, హృతిక్ రోషన్, అమితాబ్ బచ్చన్, కరణ్ జోహార్లు టాప్ 5లో ఉన్నారు. అలాగే జెప్టో వ్యవస్థాపకుడు 21 ఏళ్ల వయసు గల కైవల్య వోహ్రా చోటు దక్కించుకున్నారు. అతి పిన్న వయసులోనే ఈ అరుదైన ఘనత సాధించిన వ్యక్తిగా నిలిచారు. అలాగే 22 ఏళ్ల అదిత్ పలిచా రెండో స్థానంలో ఉన్నారు.