iDreamPost
android-app
ios-app

ఈషా, ఆకాష్, అనంత్ అంబానీలకు వ్యాపారాలు పంచిన ముఖేష్ అంబానీ

  • Published Aug 29, 2024 | 3:57 PM Updated Updated Aug 29, 2024 | 3:57 PM

Reliance AGM 2024: ముఖేష్ అంబానీ తన ముగ్గురు పిల్లలకు వ్యాపారాలను విభజించి పంచేశారు. ఎవరి వాటా వారికి విడదీసి ఒక్కొక్కరికీ ఒక్కో బిజినెస్ ని అప్పగించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ యాన్యువల్ జనరల్ మీటింగ్ 2024లో భాగంగా వ్యాపారాలను అప్పగించారు.

Reliance AGM 2024: ముఖేష్ అంబానీ తన ముగ్గురు పిల్లలకు వ్యాపారాలను విభజించి పంచేశారు. ఎవరి వాటా వారికి విడదీసి ఒక్కొక్కరికీ ఒక్కో బిజినెస్ ని అప్పగించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ యాన్యువల్ జనరల్ మీటింగ్ 2024లో భాగంగా వ్యాపారాలను అప్పగించారు.

ఈషా, ఆకాష్, అనంత్ అంబానీలకు వ్యాపారాలు పంచిన ముఖేష్ అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 47వ వార్షిక జనరల్ మీటింగ్ జరుగుతుంది. ఆగస్టు 29న మధ్యాహ్నం రెండు గంటలకు మీటింగ్ ప్రారంభమవ్వగా.. ఈ మీటింగ్ లో ముకేష్ అంబానీ కీలక విషయాల గురించి ప్రస్తావించారు. ఈ మీటింగ్ లో తన వ్యాపారాలను తన పిల్లలకు అప్పగించారు ముఖేష్ అంబానీ. ఈషా అంబానీకి రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని అప్పగించారు. ఆకాష్ అంబానీకి జియో, అనంత్ అంబానీకి రిలయన్స్ ఎనర్జీ వ్యాపారాలను అప్పగించారు. 2022లోనే తన పిల్లలకు వ్యాపారాలను అప్పగిస్తానని ముఖేష్ అంబానీ వెల్లడించారు. ఈషా అంబానీ రిలయన్స్ రిటైల్ బిజినెస్ ని చూసుకుంటుందని.. ఆకాష్ రిలయన్స్ జియో వ్యాపారాన్ని, అనంత్ రిలయన్స్ ఎనర్జీ వ్యాపారాన్ని చూసుకుంటారని గతంలో చెప్పారు.

చెప్పినట్టుగానే ఈ ఏడాది యాన్యువల్ జనరల్ మీటింగ్ 2024లో పిల్లలకు వ్యాపారాలను పంచేశారు. వ్యాపారాలను విభజించి ఎవరి వాటా వారికి అప్పజెప్పేశారు. ఈ సందర్భంగా ఈషా అంబానీ మాట్లాడుతూ.. బ్యూటీ విషయంలో రిలయన్స్ రిటైల్ బిజినెస్ తీరా, సెఫోరా, కికో, మిలానో వంటి సౌందర్య సాధనాలతో ఓమ్ని ఛానల్ వ్యూహం ద్వారా తన ఉనికిని చాటుకుంటుందని అన్నారు. ఆఫ్ లైన్, ఆన్ లైన్ రెండింటిలోనూ గ్రోసరీ, ఫ్యాషన్, ఫార్మా వంటి వాటిలో కూడా బ్యూటీ, పర్సనల్ కేర్ ఆఫర్ చేయడానికి మెరుగుపరుస్తున్నామని అన్నారు. సౌందర్య సాధనాల్లో పెట్టే పెట్టుబడితో తమ సొంత బ్రాండ్ పోర్ట్ ఫోలియోని సృష్టించుకుని వీలుంటుందని ఈషా అంబానీ అన్నారు. ఆకాష్ అంబానీకి రిలయన్స్ జియో వ్యాపారాన్ని అందించిన సందర్భంగా ఇవాళ జియో కొత్త ఫీచర్స్ గురించి వెల్లడించారు. జియో హోమ్ పేరుతో కొత్త ఫీచర్స్ ని పరిచయం చేశారు.

జియో హోమ్ అనేది మీ ఇంటిని మరింత కనెక్ట్ చేసేదిగా, కన్వీనెంట్ గా, గతంలో కంటే స్మార్టర్ గా ఉంటుందని అన్నారు. గత కొన్నేళ్లుగా జియో అనేది డిజిటల్ హోమ్ సర్వీసులుగా రూపాంతరం చెందుతూ వచ్చిందని.. లక్షలాది మంది ఇప్పుడు అల్ట్రా ఫాస్ట్ ఇంటర్నెట్ ని ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. జియో హోమ్ బ్రాడ్ బాండ్, జియో సెట్ టాప్ బాక్స్ తో నిరంతరమైన వీడియో స్ట్రీమింగ్ ని, టాప్ ఓటీటీ అప్లికేషన్స్ ని తమ కస్టమర్స్ పొందారని అన్నారు. ఇప్పుడు జియో హోమ్ లో కొత్త ఫీచర్స్ తీసుకొచ్చామని అన్నారు. జియో టీవీ+ అనే కొత్త ఫీచర్ ని లాంచ్ చేశారు. లైవ్ టీవీ, ఆన్ డిమాండ్ షోస్, అన్ని యాప్స్ ని కలిపి ఒకే చోట చూపించే ఫీచర్ ఇలా అనేక ఫీచర్స్ తో కూడిన ఒక కొత్త ప్రోడక్ట్ ని లాంచ్ చేశారు ఆకాష్ అంబానీ. జియో టీవీ+తో హెచ్డీ క్వాలిటీతో 860 లైవ్ టీవీ ఛానల్స్, అమెజాన్, డిస్నీ+, హాట్ స్టార్ వంటి యాప్స్ నుంచి బెస్ట్ కంటెంట్ ని ఒకేచోట పొందవచ్చునని అన్నారు.