iDreamPost
android-app
ios-app

రిలయన్స్ షేర్ హోల్డర్లకు బోనస్ షేర్లు.. త్వరలో అమలు!

Reliance Shares Bonus: రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తన కంపెనీ షేర్ హోల్డర్లకు సూపర్ గుడ్ న్యూస్ చెప్పారు. గురువారం జరిగిన రిలయన్స్ సర్వ సభ్య సమావేశంలో షేర్ ల గురించి కీలక ప్రకటన చేశారు.

Reliance Shares Bonus: రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తన కంపెనీ షేర్ హోల్డర్లకు సూపర్ గుడ్ న్యూస్ చెప్పారు. గురువారం జరిగిన రిలయన్స్ సర్వ సభ్య సమావేశంలో షేర్ ల గురించి కీలక ప్రకటన చేశారు.

రిలయన్స్ షేర్ హోల్డర్లకు బోనస్ షేర్లు.. త్వరలో అమలు!

ప్రపంచ కుబేరుల్లో ఒకరైనా ముఖేశ్ అంబానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వ్యాపార రంగంలో రారాజుగా కొనసాగుతున్నారు. అంతేకాక వ్యాపార రంగంలోని దాదాపు అన్ని విభాగాల్లో ఆయన అడుగు పెట్టి..తనదైన మార్క్ ను వేశారు. ఇది ఇలా ఉంటే..నేడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రిలయన్స్ వ్యాపారాలను తన వారసులకు కట్టబెట్టారు. ఎవరి ఏం ఏం ఇస్తున్నారో స్పష్టంగా తెలియజేశారు. ఇదే సమయంలో రిలయన్స్  షేర్ హోల్డర్స్ కి ముఖేశ్ అంబానీ గుడ్ న్యూస్ చెప్పారు. గురువారం జరిగిన రిలయన్స్ సర్వసభ్య సమావేశంలో ఆ శుభవార్తను విషయం వెల్లడించారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

రిలయన్స్ వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ వాటాలు ఇవ్వాలని నిర్ణయించింది. 1:1 అంటే ఇన్వెస్టర్ల వద్ద ఉన్న ప్రతి షేరుకు మరో షేరును ఉచితంగా ఇవ్వనుంది. ఇందుకు కంపెనీ రిజర్వులో ఉన్న షేర్లను ఉచితంగా  ఉపయోగిస్తారు. బోనస్ తో షేర్ల సంఖ్య రెట్టింపైనా విలుమాత్రం యాథాతథంగా ఉంటుంది. బోనస్‌ గా షేర్ల ఇచ్చే ప్రతిపాదనను ఆమోదించేందుకు కంపెనీ బోర్డు సెప్టెంబర్‌ 5వ తేదీన సమావేశం కానుంది. ‘‘సెబీ నిబంధనల ప్రకారం సెప్టెంబర్‌ 5వ తేదీన బోర్డ్‌ఆఫ్‌ డైరెక్టర్స్‌ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో షేర్ హోల్డర్లకు 1:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్లను ఇచ్చే అంశాన్ని పరిశీలించి ఆమోదించనుంది’’ అని బీఎస్ఈ ఫైలింగ్‌లో ప్రస్తావించింది.

తాజాగా జరిగిన రిలయన్స్ వార్షిక సాధారణ సమావేశంలో కంపెనీ ఛైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 2009, 2017లో కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్​ ఇదే విధంగా తమ షేర్ హోల్డర్లకు 1: 1 నిష్పత్తిలో బోనస్ ఇచ్చింది. తాజాగా మరోసారి బోనస్​ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని ముకేశ్ అంబానీ చెప్పిన నేపథ్యంలో మదుపరులు  ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలో జారీ చేసే అదనపు షేర్లను ఇప్పటికే ఉన్న వాటదారులకు ఉచితంగా ఇవ్వడాన్ని బోనస్ షేర్లు, లేదా బోనస్ ఇష్యూ అని పిలుస్తారు. ఇప్పటికే షేర్ హోల్డర్ వద్ద  ఉన్న షేర్ల ఆధారంగా వీటిని కేటాయిస్తారు.

గురువారం ఏజీఎంలో ముకేశ్ అంబానీ బోనస్ పై ప్రకటన చేయడంతో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో రిలయన్స్ షేర్ ధర భారీ లాభాల్లోకి వెళ్లింది. ఈ రోజు రిలయన్స్ రూ.3,007 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించి మధ్యాహ్నం 2.29 సమయానికి 3,049 వద్దకు వెళ్లింది. మొత్తంగా ముఖేశ్ అంబానీ చేసిన ప్రకటనతో రిలయన్స్ షేర్ హోల్డర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి..షేర్ల విషయంలో ముఖేశ్ అంబానీ చేసిన ప్రకటనపై మీ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో తెలియజేయండి.