iDreamPost
iDreamPost
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు బాహుబలిని చూశాక అలాంటి ప్రయత్నాలు చేసి మనమూ ఇంటెర్నేషల్ లెవెల్ లో పేరూ కలెక్షన్లు తెచ్చుకోవాలని తహతహలాడని పరిశ్రమ లేదు. తమిళ హీరో విజయ్ ఏకంగా శ్రీదేవి, కిచ్చ సుదీప్ లాంటి క్యాస్టింగ్ పెట్టుకుని చేసిన పులి లాంటి సినిమాలు ఎంత డిజాస్టర్ అయ్యాయో అంత ఈజీగా మర్చిపోగలమా. హిందీలోనూ థగ్స్ అఫ్ హిందుస్థాన్ లాంటి ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. ఎన్ని చేసినా బాహుబలి టాప్ అఫ్ ది చైర్ లో ఏళ్ళ తరబడి అలా తిష్టవేసుకుని ఉండిపోయింది. అందుకే బాలీవుడ్ ఆశలన్నీ ఇప్పుడు రాబోయే బ్రహ్మాస్త్ర మీదే ఉన్నాయి. ఇప్పటికే చాలా లేట్ అయ్యింది.
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కరణ్ జోహార్ బృందం వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ ట్రయాలజీ లో మొదటి భాగం 2022 సెప్టెంబర్ 9న థియేటర్లలో రానుంది. కరోనా ఫస్ట్ వేవ్ ముందే షూటింగ్ చివరి దశలో ఉందన్నారు కానీ తీరా చూస్తే ఇప్పుడు ఏకంగా తొమ్మిది నెలలు ఆలస్యంగా రిలీజ్ డేట్ ప్రకటిస్తున్నారు. ఇందులో భారీ తారాగణం ఉంది. రన్బీర్ కపూర్-అలియా భట్ జంటగా నటించగా అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున, డింపుల్ కపాడియా, మౌని రాయ్ లాంటి ఇతర తారాగణం చాలా ఉంది. ప్రీతమ్ సంగీతం సమకూరుస్తుండగా 300 కోట్లకు పైగానే దీనికి బడ్జెట్ కేటాయించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు సిజి వర్క్ చేస్తున్నారు.
ఈ బ్రహ్మాస్త్రతో బాలీవుడ్ రేంజ్ ఏంటో చూపించాలనేది కరణ్ జోహార్ ప్లాన్. దీనికి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కూడా టార్గెట్ కావొచ్చు. జనవరి 7న రాబోతున్న ఈ విజువల్ వండర్ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇది కూడా బాహుబలి రేంజ్ లో బ్లాక్ బస్టర్ కొట్టి వేల కోట్లు కొల్లగొడితే అప్పుడు బ్రహ్మాస్త్ర లక్ష్యం ఇంకా పెరుగుతుంది. కాకపోతే మూడు భాగాలూ నిజంగా తీస్తారా లేదా అనేది చూడాలి. ఫస్ట్ పార్ట్ సక్సెస్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ మాత్రం టీమ్ లో పుష్కలంగా కనిపిస్తోంది. బాహుబలి రేంజ్ లో రెండో భాగం మీద విపరీతమైన ఆసక్తి నెలకొంటుందని పదే పదే చెబుతున్నారు. అన్ని భాషల్లోనూ దీన్ని రిలీజ్ చేస్తారు
Also Read : Bigg Boss Tamil : బిగ్ బాస్ కోసం రంగంలోకి శివగామి