మాకు రెండు రాజధానులు.. కొడాలి నాని లాజిక్‌ ఇదే..

విశాఖలో కార్యనిర్వాహక రాజధాని పెట్టడం వల్ల తమకు ఇకపై రెండు రాజధానులు ఉంటాయని కృష్ణా జిల్లా మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో మూడు రాజధానుల అంశంపై నాని తనదైన శైలిలో మాట్లాడారు. ‘‘ వైజాగ్‌లో ఉన్న ఫైవ్‌ స్టార్‌ హోటళ్లైన డాల్ఫిన్‌ మాదే, నోవాటల్‌ మాదే, గీతం విశ్వవిద్యాలయం మాదే, కార్లు, బైక్‌ డీలర్లు మావాళ్లే, అక్కడ అన్ని వ్యాపారాలు మావే, ఎక్కడకైనా వెళ్లి వ్యాపారాలు, ఉద్యోగాలు చేయగల చొరవ మా సామాజికవర్గానికి ఉంది’’ అని నాని వ్యాఖ్యానించారు.

వైజాగ్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు మావాళ్లేనన్న కొడాలి నాని.. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణను ప్రస్తావించారు. పులిలాంటి మీషాలు ఉన్న మా సామాజికవర్గం వ్యక్తి ఇక్కడ (విజయవాడ) నుంచి వెళ్లి వైజాగ్‌లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని వెలగపూడిని చూస్తూ మాట్లాడారు. భవిష్యత్‌లో మేము కూడా వైజాగ్‌కు వెళ్లి ఎంపీగానో, ఎమ్మెల్యే గానో పోటీ చేసి గెలుస్తామని చమత్కరించారు. ఉత్తరాంధ్ర ప్రజలు మంచివాళ్లని ఎవరు వచ్చినా వారి పట్ల ప్రేమాప్యాయతలు చూపిస్తారని కొనియాడారు. అందుకే తమకు అమరావతి, వైజాగ్‌.. రెండు రాజధానులు ఇప్పుడు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

Show comments