iDreamPost
iDreamPost
ఇంకో పదమూడు రోజుల్లో సంక్రాంతి బాక్సాఫీస్ సంబరాలు మొదలుకాబోతున్నాయి. ఏకంగా ఆరు సినిమాలు బరిలో ఉన్నప్పటికీ తెలుగు ప్రేక్షకులకు ఎక్కువ ఆసక్తి ఉన్నవి రెండు కాగా మరో రెండు డబ్బింగ్ చిత్రాలు దిల్ రాజు పంపిణి చేస్తుండటంతో పోటీ రసవత్తరంగా మారింది. ఇంకో రెండు చిన్న బడ్జెట్ మూవీస్ ఇంకా కనీసం ప్రమోషన్లు కూడా మొదలుపెట్టలేదు. వీటికి సంబంధించిన రన్ టైం డీటెయిల్స్ బయటికి వచ్చాయి. చిరంజీవి బాబీ కాంబోలో రూపొందిన వాల్తేరు వీరయ్య 2 గంటల 35 నిముషాలు లాక్ చేసుకుందట. అయిదు పాటలతో మెగాస్టార్ మాస్ రాజా కాంబోకి ఇది సరైన నిడివిగా తోస్తోంది. ల్యాగ్ లేకుండా జాగ్రత్త పడినట్టు టాక్
క్రాక్ తర్వాత బాలకృష్ణతో గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీరసింహారెడ్డికి చిరు కన్నా అయిదు నిమిషాల ఎక్కువ స్పేస్ దక్కింది. 2 గంటల 40 నిమిషాలతో ఫ్యాన్స్ కి కనువిందు చేయబోతున్నాడు. సెంటిమెంట్ ఫ్యాక్షన్ సమపాళ్లలో కలిపిన ఈ మసాలా ఎంటర్ టైనర్ మీద అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు, విజయ్ కి భారీ క్రేజ్ లేకపోయినా కేవలం తన నిర్మాణంలో వస్తున్న సినిమా కావడంతో దిల్ రాజు ఎక్కువ థియేటర్లలో ప్లాన్ చేసిన వారసుడు అందరికంటే ఎక్కువ 2 గంటల 43 నిమిషాల లెన్త్ ఫిక్స్ అయ్యింది. దర్శకుడు వంశీ పైడిపల్లి ఎమోషన్లను చెప్పే పద్ధతి కాస్త సుదీర్ఘంగా ఉంటుంది కాబట్టి ఇలా జరిగినట్టు ఉంది
అజిత్ తెగింపు క్రిస్పీగా 2 గంటల 23 నిమిషాలకు కుదించుకుంది. బ్యాంకు రాబరీకి సంబంధించి రెండు గ్యాంగ్స్ మధ్య ఛేజ్ డ్రామాగా దర్శకుడు వినోత్ దీన్ని రూపొందించారు. అసలు బజ్ లేని పరిస్థితిలో దీనికి ఓపెనింగ్స్ రావడం కష్టమే. మిగిలిన రెండు ఇంకా సెన్సార్ కాపీని సిద్ధం చేసుకోలేదు ఇంకో రెండు మూడు రోజుల్లో ఆ లాంఛనం పూర్తయిపోతుంది. వీటిలో ఏదీ మూడు గంటలకు దగ్గరగా లేకపోవడం కొంచెం రిలీఫ్ కలిగించే అంశం. పండగ హడావిడిలో ఎక్కువ షోలు పడాలంటే లెన్త్ ఎక్కువ ఉండకపోవడమే మంచిది. వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ 8న వైజాగ్ లో, వీరసింహారెడ్డి వేడుక 6న ఒంగోలులో భారీ ఎత్తున జరగబోతున్నాయి.