iDreamPost
android-app
ios-app

చిరంజీవి-వశిష్ట సినిమా టైటిల్ ఇదే! అదిరింది!

  • Published Oct 25, 2023 | 4:25 PM Updated Updated Oct 25, 2023 | 4:39 PM

టాలీవుడ్ మెగాస్టార్ మరో సినిమాను మొదలు పెట్టేశారు. బింబిసార మూవీ డైరెక్టర్ వశిష్టతో సినిమా చేస్తున్న సంగతి విదితమే. దసరా పండుగను పురస్కరించుకుని సినిమా పూజా కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ అప్ డేట్ వచ్చింది.

టాలీవుడ్ మెగాస్టార్ మరో సినిమాను మొదలు పెట్టేశారు. బింబిసార మూవీ డైరెక్టర్ వశిష్టతో సినిమా చేస్తున్న సంగతి విదితమే. దసరా పండుగను పురస్కరించుకుని సినిమా పూజా కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ అప్ డేట్ వచ్చింది.

  • Published Oct 25, 2023 | 4:25 PMUpdated Oct 25, 2023 | 4:39 PM
చిరంజీవి-వశిష్ట సినిమా టైటిల్ ఇదే! అదిరింది!

మెగాస్టార్ చిరంజీవి గురించి, ఆయన నటన, సినిమాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు తడబడ్డా.. ఆయన ఎప్పుడూ వెండితెరకు మెగాస్టారే. ఆయన సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్‌కు పండుగతో పాటు పూనకాలే. అభిమానుల అన్నయ్యగా పేరుగాంచిన చిరు.. 150 సినిమాలు పూర్తి చేసి 160వ సినిమా దిశగా దూసుకెళుతున్నారు. అయితే ఇటీవల ఆయన చేసిన సినిమాలు అంతగా మెప్పించడం లేదు. ఆచార్య, భోళా శంకర్ వంటి మూవీస్ అయితే బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి. దీంతో కథల ఎంపికలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు చిరు. కొత్త డైరెక్టర్ తో సినిమాను షురూ చేశారు. ఇప్పటికే దసరా పండుగను పురస్కరించుకుని ఆ ప్రాజెక్ట్ పూర్తి చేశారు.

టాలీవుడ్ పరిశ్రమలో యువ దర్శకులు వస్తున్నారు. కొత్త కథనంతో, కథనాలతో మెస్మరైజ్ చేస్తున్నారు. ఆ కోవకే వస్తారు వశిష్ట. బింబిసార అనే సినిమాతో మెప్పించిన ఈ యంగ్ టాలెంట్.. ఇప్పుడు ఏకంగా చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నారు. ఈ సినిమా ప్రాజెక్ట్ తాజాగా పట్టాలు ఎక్కింది. ఇది కూడా సోషియో ఫాంటసీ మూవీ అన్నట్లు తెలుస్తోంది. ముల్లోకాల నేపథ్య కథతో సినిమా తీస్తున్నారని టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమాలోనే నటుడు రానా విలన్ గా నటించబోతున్నారని సమాచారం. ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక పోతే ఈ సినిమా పేరు కూడా దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. కథకు తగ్గట్లుగా పవర్ ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.

తొలుత ముల్లోకాల వీరుడు అనుకున్నారట.. కానీ ఫైనల్‌గా విశ్వంభర అనే టైటిల్ కన్ఫమ్ అయినట్లు తెలుస్తోంది. విశ్వంభర అంటే భూమి, ధరిత్రి, నేల, విశ్వమును పాలించేవాడు, విష్ణువు, అతేంద్రియ శక్తి వంటి విశేషార్ధాలు ఉన్నాయి. ఈ టైటిల్.. ఈ సినిమాకు యాప్ట్ అని డైరెక్టర్ వశిష్ట బలంగా నమ్ముతున్నారని ఇండస్ట్రీ టాక్. దాదాపుగా ఈ టైటిల్ ఫిక్స్ అయిపోవాలని భావిస్తున్నారట చిత్ర యూనిట్. పాన్ ఇండియాగా తెరకెక్కబోతున్న ఈ సినిమా బడ్జెట్ రూ. 200 కోట్లని తెలుస్తోంది. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. ఇక హీరోయిన్, ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet