Arjun Suravaram
Arjun Suravaram
సమాజంలో జరిగే అవినీతి, అన్యాయాలు, నేరాలను అరికట్టడం పోలీసుల బాధ్యత. అలానే అక్రమాలను అరికడుతూ పోలీసులు ఎంతో నిజాయితీగా విధులు నిర్వహిస్తుంటారు. కొందరు మాత్రం అవినీతి సంపాదనకు అలవాటు పడి.. పోలీస్ డిపార్ట్మెంట్ కే అపకీర్తి తీసుకొస్తుంటారు. వివిధ రకాల ముఠాలతో చేతులు కలిపి అక్రమంగా ధనం కూడబెడుతుంటారు. ఇలాంటి అవినీతి పోలీసులు ఇప్పటికే అనేక మంది దొరికారు. తాజాగా విశాఖలో మరో మహిళ సీఐ అడ్డగా దొరికిపోయింది. విశాఖలో నోట్ల మార్పిడి వ్యవహారంలో ఈమె రూ.15 లక్షలు నొక్కేసినట్లు తెలిసింది. మరి.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే…
విశాఖ పట్నంలో నోట్ల మార్పిడి కేసులో ఓ పార్టీ నాయకుడి అనుచరుడు అరెస్ట్ అయ్యాడు. రూ.2 వేల నోట్ల మార్పిడి కేసులో ఇప్పటి వరకు నలుగురికిపై కేసు నమోదైంది. రూ.90 లక్షలకు సరిపడా రూ.500 నోట్లు ఇస్తే కోటి రూపాయలకు సరిపడ రూ.2 వేల నోట్లు ఇస్తామని చెప్పి.. కొల్లి శ్రీను,శ్రీధర్ అనే ఇద్దరి ఓ ముఠా మోసం చేసింది. అయితే బాధితులు విశాఖ సీపీని ఆశ్రయించి.. తమ సమస్యను విన్నవించుకున్నారు. వెంటనే స్పందించిన విశాఖ సీపీ.. దర్యాప్తు కొనసాగించారు. నోట్ల మార్పిడి ముఠాకు ఏఆర్ ఆర్ఐ స్వర్ణలత నాయకత్వం వహించినట్లు పోలీసులు తేల్చారు. ప్రస్తుతం హోమ్ గార్డ్స్ ఏఆర్ సీఐగా స్వర్ణలత విధులు నిర్వహిస్తున్నారు.
బాధితులు అందించిన రూ.90 లక్షల్లో స్వర్ణలత రూ.15 లక్షలు నొక్కేసినట్లు తేలింది. తన కానిస్టేబులను పంపించి.. డీల్ మాట్లాడుకున్నదాని కంటే ఎక్కువ ఇవ్వాలని బాధితును డిమాండ్ చేసింది. అంతేగాక తన సిబ్బంది చేత బాధితులను కొట్టి.. బెదిరించి పంపేసింది. తాము మోసపోయినట్లు గ్రహించిన బాధితులు పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో ఈ లేడీ సీఐ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు విచారమలో ఈ మహిళ సీఐ చేతివాటంలో విస్తుత పోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తన పరిధి కాకపోయినా అనధికార తనిఖీలు చేపట్టడం.. కేసులు, జైలు అంటూ బెదిరింపులతో అందినకాడికి దోచుకోవడంఈ మహిళా సీఐ స్టైల్ రిటైర్డ్ నేవల్ అధికారులు విషయంలోనూ అదే పంథా కొనసాగించినట్లు విచారణలో తేలింది. ఇక ఈ నోట్ల మార్పిడి కేసులో స్వర్ణలతపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మహిళా సీఐ స్వర్ణలతపై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నాయి. పలు ప్రాంతాలకు యూనిఫామ్ లో వెళ్లి.. బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. స్వర్ణలతతో పాటు ఆమె డ్రైవర్ మెహర్ అలియాస్ హేమ సుందర్, మరో హోంగార్డు శ్రీను, బ్రోకర్ సూర్యలను అదుపులోకి తీసుకున్నారు. ఈ రూ.2వేల నోట్ల దందాకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరి.. ఈ వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.