iDreamPost
android-app
ios-app

ఓవ‌ర్ లోడ్ ఆటోలో 27 మంది, అవాకైన ట్రాఫిక్ పోలీసులు

  • Published Jul 11, 2022 | 5:59 PM Updated Updated Jul 11, 2022 | 5:59 PM
ఓవ‌ర్ లోడ్ ఆటోలో 27 మంది, అవాకైన ట్రాఫిక్ పోలీసులు

అసలు నలుగురైదుగురు ప్రయాణీకులను మాత్రమే ఎక్కించగలిగే సామర్థ్యం ఉన్న ఆటోలో, 27 మంది ప్యాసింజ‌ర్ల‌ను ఎక్కించుకోవడమంటే, ఆశ్చర్యంగా లేదూ?

రోడ్డుమీద వేగంగా వెళ్తున్న ఆటోను పోలీసులు ఆపారు. అంద‌ర్నీ బైట‌కు దిగ‌మన్నారు. 1…2…5…10…15 ఇంకా దిగుతూనే ఉన్నారు. పోలీసులు ప్రయాణికులను ఒక్కొక్కరుగా లెక్కిస్తున్న‌ వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో క‌నిపించింది.


ఫతేపూర్‌లోని బింద్కీ కొత్వాలి ప్రాంతంలో, పోలీసులు స్పీడ్ గన్ లో, ఆటో స్పీడును చూసి అదిరిపోయారు. అతివేగంతో వెళ్తున్న ఆటోను పోలీసులు వెంబడించారు.

ఆటో డ్రైవ‌ర్ ని తిట్టి, లోప‌లున్న‌వారిని బైట‌కు ర‌మ్మంటే, డ్రైవర్‌తో సహా 27 మంది ఆటోలోంచి దిగుతుంటే, పోలీసులు అవాక్కైయ్యారు. అందులో పెద్ద‌వాళ్లు ఉన్నారు…చిన్న‌పిల్ల‌లూ ఉన్నారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు కారును పోలీసులు సీజ్ చేశారు.

డ్రైవ‌ర్ తోపాటు ముగ్గురు జ‌ర్నీచేయ‌డానికే ఆటోకు ప‌ర్మిష‌న్ ఉంది. అంతేకాదు, అంత‌క‌న్నా ఎక్కువ‌మందితో జర్నీచేస్తే ఆటోకు ప్ర‌మాదం జ‌రిగే అవ‌కాశం ఉంది. అలాంటిది ఒక ఆటో 70-80కిలోమీట‌ర్ల స్పీడుతో వెళ్తుంటే, ఒక‌వేళ జ‌ర‌గ‌రాదిని జ‌రిగితే? అందులో ఒక‌రిమీద మ‌రొక‌రు, చిన్నా, పెద్ద క‌ల‌సి 27మంది ఉన్నారంటే.. ఏమ‌నుకోవాలి?

భారతదేశంలో బుల్లెట్ ట్ర‌యిన్ తో పోటీప‌డేలా ఆటోడ్రైవ‌ర్లు డ్రైవ్ చేస్తుంటారు. ఆటోలు ప‌ల్టీలు కొట్టినా ప‌ట్టించుకోరు. హైద‌రాబాద్ లాంటి చోట్ల ఇదే పెద్ద స‌మ‌స్య‌.