iDreamPost
రెండో రోజునుంచి డిజాస్టర్ టాక్ రావడంతో, కలెక్షన్స్ ఇంకా పడిపోయాయి. లైగర్ ఎఫెక్ట్ విజయ్ దేవరకొండ, పూరి కలిసి చేస్తున్న తదుపరి చిత్రం జన గణ మనపై బాగా కనిపిస్తున్నాయి.
రెండో రోజునుంచి డిజాస్టర్ టాక్ రావడంతో, కలెక్షన్స్ ఇంకా పడిపోయాయి. లైగర్ ఎఫెక్ట్ విజయ్ దేవరకొండ, పూరి కలిసి చేస్తున్న తదుపరి చిత్రం జన గణ మనపై బాగా కనిపిస్తున్నాయి.
iDreamPost
లైగర్ బాక్సాఫీస్ వసూళ్లు ఫస్ట్ షోకు అదరగొట్టినా, ఆ తర్వాత బాగా దెబ్బతిన్నాయి. రెండో రోజునుంచి డిజాస్టర్ టాక్ రావడంతో, కలెక్షన్స్ ఇంకా పడిపోయాయి. లైగర్ ఎఫెక్ట్ విజయ్ దేవరకొండ, పూరి కలిసి చేస్తున్న తదుపరి చిత్రం జన గణ మనపై బాగా కనిపిస్తున్నాయి.
లిగర్ ఈ యేడాది ఆడియన్స్ ఎదురుచూసిన సినిమాల్లో ఒకటి. కాని దురదృష్టవశాత్తు, కలెక్షన్స్ కనీసం ప్రీ-రిలీజ్ హైప్‌కు దగ్గరగా రాలేకపోయాయి. లిగర్ ట్రైలర్ అదిరిపోయింది. ఇదే అదునుగా విజయ్ దేవరకొండ, అనన్య పాండే లైగర్‌ను ఉత్సాహంగా, రోజూ ప్రమోట్ చేశారు. ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదు. రోజుకు కనీసం పదిగంటల పాటు ప్రమోషన్స్ వర్క్ మీదే ఉన్నారు. ఎక్కడికెళ్లినా జనం పోటెత్తారు. విజయ్ కున్న క్రేజ్ ను చూసి బాలీవుడ్ ఆశ్చర్యపోయింది. అందుకే ఫస్ట్ షోకు బాగా అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది.
ఇవన్నీ ఉన్నా, లిగర్ బాక్సాఫీస్ కలెక్షన్ మాత్రం ఫస్ట్ షో తప్ప మరెప్పుడూ హుషారుగా లేవు. కోట్లు కోల్పోయామన్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నష్టపరిహారం డిమాండ్ చేస్తున్నారన్న వార్తల మధ్య, హీరో , డైరెక్టర్లు ఫీజులను కొంతవరకు వదులుకొంటున్నారని ముంబై వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
లైగర్ బాక్సాఫీస్ డిజాస్టర్ దెబ్బ విజయ్ దేవరకొండ , పూరీ జగన్నాధ్ కలిసి చేస్తున్న జన గణ మనపై బాగా పడింది. ఫీజులు కొంతవరకు వదులుకున్నా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నష్టపోయినదానితో పోలిస్తే చాలా తక్కువ. అందుకే నెక్ట్స్ మూవీ జన గణ మన కోసం వారి రెమ్యునిరేషన్లు వదులుకోవాలని నిర్ణయించుకున్నారు, ఇది కూడా పాన్-ఇండియా సినిమాయే. లైగర్ తో దెబ్బతిన్న డిస్ట్రిబ్యూటర్లకు జనగనమన సినిమాను తక్కువ రేట్లకు ఇస్తారు. ఆమేరకు నష్టాలను పూరిస్తారు.