iDreamPost
android-app
ios-app

లైగర్ హంటింగ్ మొదలు..

  • Published May 09, 2022 | 6:43 PM Updated Updated May 09, 2022 | 6:43 PM
లైగర్ హంటింగ్ మొదలు..

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా లైగర్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఇవాళ (మే 9న) విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా లైగర్ హంట్ థీమ్ అంటూ ఓ లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఈ హంట్ థీమ్ లిరికల్ వీడియో ఫుల్ మాస్ బీట్ తో అదిరిపోయింది. బతకాలంటే గెలవాల్సిందే..
ఎగరాలంటే రగలాల్సిందే.. అంటూ మోటివేషన్ సాంగ్ ని మాస్ బీట్ లో అందించారు. విజయ్ ఈ సినిమా కోసం అద్భుతంగా తన దేహాన్ని మార్చిన తీరు ఇందులో కనిపిస్తుంది. ఈ పాటని భాస్కరభట్ల రాయగా విక్రమ్ మాంట్రోస్ సంగీత దర్శకత్వంలో హేమ చంద్ర ఫుల్ ఎనర్జీటిక్ గా పాడారు.

ఈ లైగర్ హంట్ థీమ్ సినిమాపై మరిన్ని అంచనాలని పెంచింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. లెజండరీ బాక్సర్ మైక్ టైసన్ ఇందులో ముఖ్య పాత్ర పోషించనున్నారు. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.