liger లైగర్ నేర్పిన ఖరీదైన పాఠాలు

విజయ్ దేవకొండ ట్వీట్లు వేయడం కూడా ఆపేశాడు. ఎంత ఫ్లాప్ అయినా కనీసం ఓ వారం రోజుల పాటు ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ సినిమాకు బూస్ట్ ఇవ్వడం అందరు హీరోలు చేసేదే.

విజయ్ దేవకొండ ట్వీట్లు వేయడం కూడా ఆపేశాడు. ఎంత ఫ్లాప్ అయినా కనీసం ఓ వారం రోజుల పాటు ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ సినిమాకు బూస్ట్ ఇవ్వడం అందరు హీరోలు చేసేదే.

నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ ని టార్గెట్ చేసుకుని వచ్చిన లైగర్ రెండో రోజే చాలా డౌన్ అయిపోయింది. విడుదల ముందు వరకు విపరీతమైన ప్రమోషన్లు చేసిన టీమ్ ఉన్నట్టుండి సైలెంటయ్యింది. విజయ్ దేవకొండ ట్వీట్లు వేయడం కూడా ఆపేశాడు. ఎంత ఫ్లాప్ అయినా కనీసం ఓ వారం రోజుల పాటు ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ సినిమాకు బూస్ట్ ఇవ్వడం అందరు హీరోలు చేసేదే. కానీ దానికి భిన్నంగా విజయ్ ఇలా మౌనం వహించడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం రెండు వందల కోట్ల నుంచి ఓపెనింగ్ ఉంటుందని రౌడీ బాయ్ అన్న మాటలు ట్రోలింగ్ కి దారి తీస్తాయనే ఉద్దేశంతో ఆగాడా లేక ఓటమిని భరించలేక సైలెంట్ అయ్యాడా అనేది తెలియదు.

మొత్తానికి లైగర్ చాలా ఖరీదైన పాఠాలు నేర్పించింది. ప్యాన్ ఇండియా ఉచ్చులో పడి వందల కోట్ల బిజినెస్ చేయడమే టార్గెట్ గా పెట్టుకుని కథా కథనాలను తేలిగ్గా తీసుకుంటే ప్రేక్షకులు ఎంత దారుణంగా తిరస్కరిస్తారో వసూళ్ల సాక్షిగా ఋజువయ్యింది. ఫస్ట్ డే నైజాంలో నాలుగు కోట్లకు పైగా వసూలైతే సెకండ్ డేకి అది కోటి లోపలే పడిపోయిందని ట్రేడ్ చెప్పడం చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తేటతెల్లం చేస్తోంది. పైగా హిందీ వెర్షన్ ఏదో బిల్డప్ కోసం అన్నట్టుగా రాత్రి షో నుంచి లేట్ రిలీజ్ చేయడం బెడిసి కొట్టింది. మొన్నటి దాకా తెగమోసిన బాలీవుడ్ క్రిటిక్స్ నిన్న రివ్యూలలో విరుచుకుపడ్డారు. ఐఎండిబి రేటింగ్ లో లాల్ సింగ్ చడ్డాకు 5 రేటింగ్ ఉంటే లైగర్ మరీ అన్యాయంగా 1.7 దగ్గర ఆగిపోయింది.

పూరి బ్రాండ్ మరోసారి డేంజర్ లో పడింది. ఏళ్ళ తరబడి వేచి చూసిన సక్సెస్ ఇస్మార్ట్ శంకర్ రూపంలో బంగారు పళ్లెంలో వస్తే ఆయన చేతులారా పారబోసుకున్నట్టు అయ్యింది. నెక్స్ట్ చేయబోయే జనగణమన మీద ఈ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఒళ్ళు హూనం చేసుకుని ఫైటర్ క్యారెక్టర్ కోసం మేకోవర్ చేసుకున్న విజయ్ దేవరకొండకు కనీసం దానికో పాతిక శాతం న్యాయం జరగకపోవడం అసలు ట్రాజెడీ. ఆడియన్స్ ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఆచార్య, రామారావు ఆన్ డ్యూటీ, మాచర్ల నియోజకవర్గం, రాధే శ్యామ్ ల తర్వాత ఇప్పుడీ లైగర్ నిరూపిస్తోంది. అప్ కమింగ్ దర్శకులు వీటిని పాఠాలుగా తీసుకుంటే ఏ తప్పులు చేయకూడదో తెలుసుకుంటారు

Show comments