iDreamPost
android-app
ios-app

అర్జున్ రెడ్డి విడుదలై 7 ఏళ్లు.. సందీప్ రెడ్డి వంగాకి విజయ్ స్పెషల్ రిక్వెస్ట్!

  • Published Aug 25, 2024 | 5:05 PM Updated Updated Aug 25, 2024 | 5:05 PM

7 Years For Arjun Reddy- Vijay Devarakonda- Sandeep Reddy Vanga: టాలీవుడ్ సినిమాని షేక్ చేసిన చిత్రాల జాబితాలో అర్జున్ రెడ్డి కచ్చితంగా ఉంటుంది. ఈ మూవీ విడుదలై ఏడేళ్లు అయిపోయింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకి స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు.

7 Years For Arjun Reddy- Vijay Devarakonda- Sandeep Reddy Vanga: టాలీవుడ్ సినిమాని షేక్ చేసిన చిత్రాల జాబితాలో అర్జున్ రెడ్డి కచ్చితంగా ఉంటుంది. ఈ మూవీ విడుదలై ఏడేళ్లు అయిపోయింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకి స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు.

  • Published Aug 25, 2024 | 5:05 PMUpdated Aug 25, 2024 | 5:05 PM
అర్జున్ రెడ్డి విడుదలై 7 ఏళ్లు.. సందీప్ రెడ్డి వంగాకి విజయ్ స్పెషల్ రిక్వెస్ట్!

సందీప్ రెడ్డి వంగా అనే పేరు టాలీవుడ్ లోనే కాదు.. ఇండియన్ సినిమాలోనే ఒక సెన్సేషన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన తీసే ఒక్కో సినిమా ప్రేక్షకులను పిచ్చోళ్లని చేసింది. యానిమల్ అనే సినిమాతో ఇండియన్ సినిమా మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు. అయితే సందీప్ తన మార్క్ ని అర్జున్ రెడ్డి సినిమాతోనే చూపించాడు. టాలీవుడ్ లోనే కాకుండా.. ఆ సినిమాని తమిళ్, హిందీ భాషల్లో కూడా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా విజన్ కి, టేకింగ్ కి అర్జున్ రెడ్డి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. తాజాగా అర్జున్ రెడ్డి సినిమా విడుదలై ఏడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రౌడీ హీరో తన డైరెక్టర్ కి ఒక స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు.

తెలుగు సినిమాలో అర్జున్ రెడ్డి మూవీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సినిమా సందీప్ రెడ్డి వంగాకే కాదు.. హీరో విజయ్ దేవరకొండకు కూడా కెరీర్ లో బ్రేక్ త్రూ అనే చెప్పాలి. యువత మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ మూవీపై ఎన్నో విమర్శలు, మేథావుల నుంచి నిరసనలు కూడా వచ్చాయి. కానీ, తెలుగు సినిమా ప్రేక్షకులు మాత్రం అర్జున్ రెడ్డి సినిమాకి పట్టం కట్టారు. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా టేకింగ్ కి అంతా ఫిదా అయిపోయారు. అర్జున్ రెడ్డి సినిమా విడుదలై ఏడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా అర్జున్ రెడ్డి సినిమాకి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ ని పంచుకున్నాడు.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సినిమా వచ్చి అప్పుడే 7 ఏళ్లు అయ్యింది అంటే నమ్మలేకపోతున్నాను అన్నాడు. ఆ జ్ఞాపకాలను తల్చుకుంటే గతేడాది జరిగినట్లు ఉంది అంటూ విజయ్ కామెంట్ చేశాడు. అలాగే విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకి ఒక స్పెషల్ రిక్వెస్ట్ కూడా చేశాడు. అదేంటంటే.. అర్జున్ రెడ్డి సినిమా టెన్త్ యానివర్సరీకి మాత్రం సందీప్ రెడ్డి వంగా కట్ అర్జున్ రెడ్డి వర్షన్ ని ఫ్యాన్స్ కి చూపించాలి అంటూ కోరుకున్నాడు. అంటే సందీప్ రెడ్డి వర్షన్ ఆఫ్ అర్జున్ రెడ్డి సినిమాని పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా థియేటర్లలో విడుదల చేయాలి అని రిక్వెస్ట్ చేశాడు. నిజానికి సందీప్ రెడ్డి వంగా తీసిన సినిమాని తీసినట్లు ఆయన వర్షన్ లో విడుదల చేస్తే ప్రేక్షకులు పిచ్చెక్కిపోతారేమో? యానిమల్ విషయంలో కూడా సందీప్ రెడ్డి వంగా కట్ వర్షన్ ని ఓటీటీలోకి తెస్తారు అన్నారు. కానీ అది సాధ్యం కాలేదు. మరి.. అర్జున్ రెడ్డి విషయంలో రౌడీ హీరో రిక్వెస్ట్ ప్రకారం సందీప్ రెడ్డి వంగా ఏమైనా ప్లాన్ చేస్తాడేమో తెలియాలి అంటే ఇంకో మూడేళ్లు ఆగాల్సిందే.

 

View this post on Instagram

 

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş