iDreamPost
android-app
ios-app

కరోనా ఎఫెక్ట్ – సివిల్ సర్వీస్ పరీక్షలు వాయిదా…

కరోనా ఎఫెక్ట్ – సివిల్ సర్వీస్ పరీక్షలు వాయిదా…

కరోనా సెగ సివిల్ సర్వీస్ పరీక్షలకు తగిలింది. లాక్ డౌన్ కారణంగా ఈ నెల 31న జరగాల్సిన సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూపీఎస్‌సీ ప్రకటించింది.

దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేశవ్యాప్తంగా మూడో విడత లాక్ డౌన్ కొనసాగుతుంది. మే 17 వరకూ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగునుంది. కాగా సివిల్ సర్వీస్ పరీక్షల నిర్వహణలో తదుపరి కార్యాచరణ గురించి మే 20న పరిస్థితులను బట్టి కొత్త తేదీలను వెల్లడిస్తామని యూపీఎస్‌సీ వెల్లడించింది.

ఇప్పటికే పలు తరగతుల పరీక్షల నిర్వహణ కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా మూతపడిన కళాశాలలు ఆగస్టు నుండి పునఃప్రారంభమవుతాయని యూజీసీ వెల్లడించింది. కరోనా కారణంగా కళాశాలల్లో తుది పరీక్షలు నిర్వహించకుండానే దేశవ్యాప్తంగా సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఇలా పెండింగ్ లో ఉన్న పరీక్షల గురించి మాత్రం యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ఎలాంటి ప్రకటన చేయలేదు.