iDreamPost
android-app
ios-app

IIT, IIMలో చదవలేదు.. అయినా GOOGLEలో రూ.56 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం

IIT, IIMలో చదవలేదు.. అయినా GOOGLEలో రూ.56 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం

ప్రతిభ ఉంటే చాలు అవకాశాలకు కొదవ లేదని నిరూపించింది ఆ యువతి. ఐఐటీ, ఐఐఎమ్, ఎన్ఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదవకపోయినప్పటికీ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ లో కళ్లు చెదిరే ప్యాకేజీతో ఉద్యోగం సాధించింది. ఏకంగా రూ. 56 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగానికి ఎంపికైంది. ప్రస్తుత రోజుల్లో సంస్థకు కావాల్సిన నైపుణ్యాలు ఉన్నాయంటే చాలు లక్షలు, కోట్ల ప్యాకేజీతో జాబ్ ఇవ్వడానికి ప్రముఖ కంపెనీలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు విద్యార్థులు దిగ్గజ కంపెనీల్లో భారీ వేతనాలతో ఉద్యోగాలు పొందుతున్నారు. ఈ విధంగానే ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన యువతి భారీ ప్యాకేజీతో ఉద్యోగం పొందింది.

ఆరాధ్య త్రిపాఠి అనే యువతి గోరఖ్‌పూర్‌లోని మదన్ మోహన్ మాలవీయ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ విద్యాసంస్థలో చదివింది. అయితే ఈ విద్యాసంస్థలో చదివి వారిలో ఇంత పెద్ద ప్యాకేజీతో ఉద్యోగం పొందిన వారు ఇప్పటివరకు ఎవరూ లేరు. చిన్నతనం నుంచే ఆరాధ్య చదువుల్లో చురుగ్గా ఉండేది. ఆరాధ్య త్రిపాఠి తండ్రి అడ్వకేట్.. ఆమె తల్లి గృహిణి కాగా వీరు తమ కూతుర్లోని ప్రతిభను గుర్తించి మంచి విద్యనందించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆరాధ్య ఎంఎంఎంయూటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేసింది.

కాగా బీటెక్ పూర్తయ్యాక ఆమె స్కేలర్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పూర్తి చేసింది. ఆరాధ్యకు ఆ కంపెనీ రూ.32 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం ఆఫర్ చేసింది. అయితే ఇప్పుడు అంతకంటే ఎక్కువ రూ. 56 లక్షల వార్షిక వేతనంతో గూగుల్‌లో ఉద్యోగం పొందింది ఆరాధ్య. గూగుల్‌లో ఆమె ఇప్పుడు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరనుంది. ఇక ఆరాధ్య సాధించిన ఈ ఘనతకు కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారు. నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచిన ఆరాధ్యపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి