Man Builds 2 Storey Palace: ఒక్కడే 12 ఏళ్లు శ్రమ.. భూగర్భంలో రెండు అంతస్తుల భవనం..

ఒక్కడే 12 ఏళ్లు శ్రమ.. భూగర్భంలో రెండు అంతస్తుల భవనం..

మనిషి  అనుకుంటే సాధించనిదంటూ ఏమిలేదు. కొండల్ని సైతం పిండి చేయగల సామర్థ్యం మనిషి సొంతం. అందుకే పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే చాలు.. అనుకున్నది సాధించగలరు. మెండి పట్టుదలతో, ప్రారంభించిన పనిని విడిచిపెట్టకుండా విజయం సాధించిన వారు ఎందరో ఉన్నారు. ఊరికి నీరు అందించడం కోసం కొండనే రెండు ముక్కులు చేసిన వ్యక్తుల గురించి మనం తెలుసుకున్నాం. ఏళ్లకు ఏళ్లు శ్రమించి వారు ఆ సంకల్పాన్ని పూర్తి చేశారు. తాజాగా ఓ వ్యక్తి 12 ఏళ్లు శ్రమించి.. భూగర్భంలో రెండు అంతస్తుల భవనాన్ని నిర్మించాడు. ఒంటి చేతితో భవనాన్ని నిర్మించిన ఈ వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఉత్తర్ ప్రదేశ్ లోని హర్ధోయ్  ప్రాంతంలో ఇర్ఫాన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అందరూ అతడిని పప్పు బాబా అంటారు. ఇలాంటి బాబా ఓ అద్భుతాన్ని సృష్టించాడు.  హర్ధోయ్ ప్రాంతంలో రెండు అంతస్తుల భవనాన్ని నిర్మించాడు. ఈ నిర్మాణానికి కేవలం ఒక్క పారను మాత్రమే వినియోగించాడు. అది కూడా ఈ ప్యాలెస్ ను భూగర్భంలో రెండు అంతస్తులు వచ్చేలా నిర్మించాడు. కేవలం అతడు ఒక్కడే ఈ భవనాన్ని నిర్మించాడు. ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి  ఇర్ఫాన్ కి 12 ఏళ్లు పట్టింది. 2011లో  ఈ భవన నిర్మాణాన్ని ప్రారంభించాడు.  అప్పుడు మొదలైన ప్యాలెస్ నిర్మాణం.. కొన్ని నెలల క్రితమే పూర్తైంది.

ఈ రెండు అంతస్తుల భవనంలో 11 గదులు, ఒక మసీదు , ఒక గ్యాలరి, ఒక డ్రాయింగ్ రూమ్ వంటివి నిర్మించాడు. పక్కా వాస్తుతో వీటిని ఇర్ఫాన్ నిర్మించాడు. అంతే కాదు భవన నిర్మాణంలో ఓ బావిని కూడా నిర్మించాడు. స్థానికులు ఈ బావి నీటిని తాగటానికి ఉపయోగపడేలా చేశాడు. కానీ కొంతమంది ఆ బావిని నాశనం చేశారని విచారం వ్యక్తం చేశాడు. 2011లో ఈ భవనాన్ని ఓ పార సహాయంతో నిర్మించటం ప్రారంభించి.. ఎన్నో అడ్డంకుల్ని ఎదుక్కొంటూ 12 ఏళ్లకు పూర్తి చేశాడు. కుటుంబానికి కూడా దూరంగా ఉండి దీన్ని పూర్తి చేశాడు. ఈ నిర్మాణం చూడటానికి ఎంతోమంది వస్తుంటారు. మరి.. ఈ అద్భుత కట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments