iDreamPost
android-app
ios-app

జవాన్ల సమాధుల వద్ద డ్యాన్సులు.. అక్కాచెల్లెళ్లు అరెస్ట్‌!

  • Published Aug 31, 2023 | 2:51 PM Updated Updated Aug 31, 2023 | 2:51 PM
  • Published Aug 31, 2023 | 2:51 PMUpdated Aug 31, 2023 | 2:51 PM
జవాన్ల సమాధుల వద్ద డ్యాన్సులు.. అక్కాచెల్లెళ్లు అరెస్ట్‌!

సోషల్‌ మీడియాలో ఫేమ్‌ కోసం కొంతమంది పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. తమ పిచ్చి పనుల కారణంగా కష్టాల్లో పడుతున్నారు.  ప్రపంచవ్యాప్తంగా నిత్యం పదుల సంఖ్యలో జైలు పాలు అవుతున్నారు. తాజాగా, ఓ అక్కాచెల్లెళ్ల జంట జవాన్ల సమాధుల వద్ద అసభ్య డ్యాన్సులు చేసి చిక్కుల్లో పడింది. జైలు పాలు కూడా అయింది. జైలు నుంచి విడుదల అయిన తర్వాత తాము చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకుంది. ఈ సంఘటన ఉక్రేయిన్‌ దేశంలో ఆలస్యంగా వెలుగు చూసింది.

ఆ వివరాల్లోకి వెళితే.. ఉక్రెయిన్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఖాతాను నిర్వహిస్తున్నారు. వీరికి ఇన్‌స్టాలో చాలా మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. వీరు తమ ఫాలోవర్స్‌ను ఖుషీ చేయటానికి.. కొత్త ఫాలోవర్స్‌ను సొంతం చేసుకోవటానికి డ్యాన్సులు చేస్తూ ఉంటారు. గత ఆగస్టు 24 ఉక్రేయిన్‌ స్వాతంత్ర దినోత్సవం రోజున కూడా డ్యాన్స్‌ చేయాలని అనుకున్నారు. ఇందుకోసం ఓ శ్మశానానికి వెళ్లారు. అక్కడ జవానుల సమాధుల దగ్గర డ్యాన్సులు వేశారు. ఆ వీడియోను తమ సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేశారు.

ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియో అధికారుల దృష్టికి కూడా వెళ్లింది. దీంతో అధికారులు వారి అరెస్ట్‌ చేశారు. తర్వాత ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు బెయిల్‌ మీద విడుదలై బయటకు వచ్చారు. తర్వాత తాము చేసిన దానికి క్షమాపణ చెప్పారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ఎవ్వరినీ కించపరిచే ఉద్దేశ్యంతో ఆ వీడియో చేయలేదన్నారు. మరి, జవాన్ల సమాధుల వద్ద డ్యాన్సులు చేసి చిక్కుల్లో పడ్డ ఈ అక్కాచెల్లెళ్ల ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by усміхнене металеве рильце (@vl_lindemann)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss