iDreamPost
iDreamPost
ఎంతోమంది హిందువుల కల అయోధ్య రామ మందిరం. రామ మందిరానికి సపోర్ట్ గా చారిత్రాత్మిక తీర్పు రావడం, 2020 ఆగస్టులో ఆలయానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయడంపై భారతీయులంతా హర్షం వ్యక్తం చేశారు. ఎప్పుడెప్పుడు ఆ ఆలయం పూర్తి అవుతుంది, ఎప్పుడెప్పుడు రాముల వారిని దర్శించుకుందాం అని కోట్ల మంది భక్తులు ఎదురు చూస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని రామ మందిర నిర్మాణంలో మరో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. తాజాగా ఆలయ గర్భగుడి నిర్మాణానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శంకుస్థాపన చేశారు. అలాగే ప్రధానాలయ నిర్మాణానికి యోగి చేతుల మీదుగా శైల పూజ జరిగింది. యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, రామ మందిర ట్రస్టు అధికారులు కూడా ఈ పూజలో పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో యోగిజీ మాట్లాడుతూ.. మందిర నిర్మాణం దేశ ఐక్యతకు నిదర్శనం, దురాక్రమణదారులపై విజయం. అయోధ్య రామాలయం మన జాతీయాలయం. ప్రజల ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ప్రతి భారతీయునికి గర్వకారణం అని తెలిపారు.