iDreamPost
android-app
ios-app

ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తోన్న వీడియో.. తనంతట తానే తిరుగుతున్న తులసి మొక్క!

  • Published Jul 03, 2023 | 6:41 PMUpdated Jul 03, 2023 | 6:41 PM
  • Published Jul 03, 2023 | 6:41 PMUpdated Jul 03, 2023 | 6:41 PM
ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తోన్న వీడియో.. తనంతట తానే తిరుగుతున్న తులసి మొక్క!

ఈ ఇంటర్నెట్‌ యుగంలో.. అందునా సోషల్‌ మీడియా వినియోగం పెరిగాక.. ఏ వీడియో ఎప్పుడు వైరల్‌ అవుతుందో.. ఎవరు రాత్రికి రాత్రే సెలబ్రిటీ అవుతారో అంచనా వేయడం కష్టం. రాకెట్‌ యుగంలో కూడా కొన్ని వింతలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్‌ అవుతుంటాయి. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తోంది. ఈ వింతను చూడటానికి జనాలు తెగ ఎగబడుతున్నారు. ఇంటర్నెట్‌లో ఇప్పటికే ఈ వీడియోని పది లక్షల మందికి పైగా చూశారు. మరి దేనికి సంబంధించిన వీడియో అంటే తులసి మొక్క తనకు తానుగా తిరుగుతుంది. మన దేశంలో తులసి మొక్కను పవిత్రంగా పూజిస్తారు. తులసిని పూజించిన తర్వాతే మిగతా పనులు ప్రారంభిస్తారు చాలా మంది. ఇంత పవిత్రంగా భావించే తులసమ్మ తనంతట తానే తిరుగుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

ఆధ్యాత్మికంగానే కాక.. ఆరోగ్య పరంగా కూడా తులసికి చాలా ప్రాధాన్యత ఉంది. వర్షాకాలంలో తులసి ఆకులను వేడి నీటిలో మరిగించి తాగుతారు. తులసి ఆకుల రసం కూడా మంచిది అని భావిస్తారు. ఇక చాలా మంది మహిళలు ఉదయం లేవగానే తులసికి పూజ చేసి.. ఆ తర్వాతే మిగతా పనులు ప్రారంభిస్తారు. అంత పవిత్రమైన తులసి మొక్కకు సంబంధించి ఒక వీడియో వైరలవుతోంది. ఇంతకు ఈ వీడియోలో ఏం ఉంది అంటే.. తులసి మొక్క తనంతట తానే తిరుగుతున్నట్టుగా ఉంది. ఒక ఎత్తైన చెట్టు అడుగున నాటిన తులసి మొక్క అటు ఇటు తిరుగుతున్నట్లుంది. అది చూసిన మహిళలు ఆశ్చర్యపోవటం, దాని గురించి ఎంతో ఉత్సాహంగా పక్క వారితో చర్చించుకోవడం అనేది ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌తో పాటు పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చక్కర్లు కొడుతోంది.

ఇప్పటికే సుమారు 13 లక్షలకు పైగా జనాలు ఈ వీడియోని చూశారు. తులసి మొత్త తానంత తానే ఎలా తిరుగుతుంది.. కింద ఆల్రెడీ ఏమైనా మెకానిజం అరెంజ్‌ చేశారా.. లేక ఇది దేవుడి మహిమా.. లేదంటే భూమి పొరల్లో ఏమైనా మార్పుల కారణంగా తులసి మొక్క ఇలా తిరుగుతుందా అని రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది నెటిజనులు మాత్రం ఇది కచ్చితంగా దేవుడి మాయే అంటున్నారు. కారణాలు తెలియకపోయినా సరే.. ఈ వింత వీడియో మాత్రం ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by सनातन सोच (@saffron_bearer_no_1)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి