నెల్లూరు రెడ్డిగారు లేటయ్యారు …!!రైలెళ్లాక స్టేషన్ కొచ్చారు !!

నెల్లూరు పెద్దారెడ్డి లేటైపోయారు ..అంతా అయిపోయాక నేనున్నాను అంటూ వచ్చారు .కానీ ప్రయోజనం లేకపోయింది..

అవును.. 1996, 98లో రెండు సార్లు లోక్ సభకు , ఆ తరువాత 2002 నుంచి వరుసగా మూడు సార్లు అంటే 18 ఏళ్ళు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన టి.సుబ్బరామిరెడ్డి పదవీకాలం త్వరలో ముగుస్తుంది. ఇన్నాళ్లుగా ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లేకున్నా ఆయన రాజ్యసభ పదవికి ఢోకాలేకపోయింది. దేశంలోని ఏదో ఒక రాష్ట్రం నుంచి ఆయన్ను కాంగ్రెస్ అధిష్టానం రాజ్యసభకు పంపుతుండేది. అయితే ఈసారి మాత్రం ఆయనకు మళ్ళీ పదవి వచ్చే సూచనలు కనిపించడం లేదు.

ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఆయన ఏ పనిమీద, ఏ ఉద్దేశంతో జగన్ను కలిసారో గానీ, ఇప్పుడు కలవడం మాత్రం రాజ్యసభ పోస్ట్ కోసం కలిశారనే అనుకుంటున్నారు. అయితే ఆయన జగన్ ను మొదటి నుంచీ పెద్దగా వ్యతిరేకించినట్లు ఎక్కడా అనిపించలేదు. ఆయన అందరివాడు, పెద్దగా ఎవరితోనూ వైరం పెట్టికునే నైజం కూడా లేదు. అయితే ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చేవిషయంలో జగన్ కు ఎలాంటి అభిప్రాయం ఉందోగాని ఆల్రెడీ నలుగురు నాయకులు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పరిమల్ మత్వాని, అయోధ్యరామిరెడ్డి లను ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులుగా ఖరారు చేసేసిన నేపథ్యంలో సుబ్బరామిరెడ్డి వచ్చి జగన్ను కలవడం వృథాయే అంటున్నారు…

అంతా అయిపోయాక పెద్దారెడ్డి గారు లేటుగా వచ్చారని, కసింత ముందొచ్చినట్లయితే అవకాశం దక్కేదేమో అనుకుంటున్నారు..మొత్తానికి రెడ్డిగారు లేటయ్యారన్నమాట అనేది వాస్తవం

Show comments