iDreamPost
iDreamPost
మే 28వ తేదీన జూబ్లిహిల్స్ లో విదేశీ మైనర్ బాలికపై ఓ కారులో గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఈ కేసులో ప్రముఖ రాజకీయనేతల పిల్లలు ఉండటం కలకలం సృష్టించింది. ఈ కేసులో తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ మనువడు కూడా ఉన్నాడని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హోంమంత్రి తన మనువడిపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. జూబ్లిహిల్స్ రేప్ కేసులో తన మనువడు కూడా ఉన్నాడంటూ దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు.
బాలికపై సామూహిక అత్యాచారం జరగడం చాలా దురదృష్టకరమన్న ఆయన.. రాష్ట్ర పోలీసులు ఈ కేసును సీరియస్ గా టేకప్ చేసి, సమర్థవంతంగా దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. మహిళలు, ఆడపిల్లలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, దాడులు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని, ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడినవారెవ్వరినీ వదలబోమన్నారు. రేప్ కేసును నీరుగారుస్తున్నారంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదన్నారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలని, చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుందని తెలిపారు.