Arjun Suravaram
Arjun Suravaram
తెలంగాణలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. వృద్ధురాలనే కనికరం లేకుండా ఓ కోడలు తన అత్తపై విచక్షణారహితంగా దాడి చేసింది. చీపురు కట్టను తిరగేసి ఇష్టం వచ్చినట్లు అత్తను చావబాదింది. దెబ్బలకు తట్టుకోలేక వృద్ధురాలు గట్టిగా కేకలు వేస్తూ కన్నీరు పెట్టుకుంది. అయినా ఆ కసాయి కోడలు కనికరం చూపలేదు. వృద్దురాలి హృదయం పగిలేలా దాడి చేసింది. అందుకు సంబంధించిన దృశ్యాలను అటుగా వెళ్తోన్న వ్యక్తి సెల్‌ఫోన్‌లో బంధించగా.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. నెటిజన్లు కోడలు కర్కషత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కంచనపల్లి గ్రామానికి చెందిన లక్ష్మమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అందరికి పెళ్లి చేసిన లక్ష్మమ్మ ప్రస్తుతం వృద్ధాప్యంలో ఉంది. ఆమె భర్త గతంలో మృతి చెందగా..ఆమె ఇద్దరు కుమారుల వద్ద ఉంటుంది. ఇద్దరు కుమారులు లక్ష్మమ్మను వంతుల వారీగా చూసుకునే వారు. ఒక నెల పెద్ద కొడుకు వద్ద, మరొక నెల చిన్న కొడుకు వద్ద ఉంటూ కాలం వెల్లదీస్తోంది. పెద్ద కుమారుడు భువనగిరి పట్టణంలో ఉంటాడు. అయితే పట్టణంలో ఉండే పెద్ద కోడలు పద్మ.. వృద్దురాలైన అత్తను చీదరించుకునేది. తన వంతు వచ్చిన ప్రతిసారీ ఆమెను సూటీపోటీ మాటలు అంటూ మనస్సును గాయపర్చేది.
అలా కోడలు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా… ఎదిరించలేక అలానే కాలం వెల్లదీస్తోంది. అయితే వృద్ధురాలు అనే కనికరం లేకుండా కోడలు పద్మ లక్ష్మమ్మపై దాడి చేసింది. చీపురు కట్టను తిరగేసి విచక్షణారహితంగా దాడి చేసింది. తనను కొట్టొద్దని లక్ష్మమ్మ వేడుకున్నా వినలేదు. దెబ్బలకు తట్టుకోలేక గట్టిగా కేకలు పెడుతూ కన్నీరు పెట్టుకుంది. అయినా ఆ కసాయి కోడలు గుండె మాత్రం కరగలేదు. అత్త కూడా తన తల్లిలాంటిదే అనే కనీస జ్ఞానం మరచి.. పశువు లాగా ప్రవర్తించింది. లక్ష్మమ్మ కాళ్లు, చేతులపై ఇష్టం వచ్చినట్లు కొట్టింది.
అది గమనించిన కొందరు స్థానికులు రహస్యంగా వీడియో తీశారు. విషయం తెలుసుకున్న చిన్న కుమారుడు అక్కడికి చేరుకుని లక్ష్మమ్మను ఆసుపత్రికి తరలించాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. కోడలిపై నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు ఆమె కోడాలా? లేక కొరివి దెయ్యమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి…ఇలా వృద్దురాలైన అత్తలపై దాడులు చేస్తోన్న ఇలాంటి కోడలకు ఏం శిక్ష విధించాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.