iDreamPost
android-app
ios-app

నిరాడంబరంగా జరిగిన నిఖిల్ వివాహం

నిరాడంబరంగా జరిగిన నిఖిల్ వివాహం

యువ కథానాయకుడు నిఖిల్ వివాహం డాక్టర్ పల్లవి వర్మతో కొద్దిమంది అతిథుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. ఈరోజు ఉదయం శామీర్‌పేటలోని ఓ ప్రైవేటు అతిథి గృహంలో నిఖిల్ వివాహ వేడుక జరిగింది.

గతంలో నిఖిల్ డాక్టర్ పల్లవి వర్మను ప్రేమిస్తున్నానని త్వరలో ఇరుకుటుంబాల అంగీకారంతో వివాహం చేసుకుంటామని వెల్లడించారు. నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఏప్రిల్ 16 న నిఖిల్ వివాహం జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వివాహ వేడుక వాయిదా పడింది. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితులు కుదుటపడిన తర్వాత తన వివాహం జరుగుతుందని నిఖిల్ వెల్లడించారు.

కాగా మళ్ళీ ఇప్పట్లో శుభముహూర్తాలు లేకపోవడంతో వధూవరుల జాతకాల రీత్యా గురువారం ఉదయం గం.6.31ని.లకి నిఖిల్ పల్లవి వర్మల పెళ్లి జరపాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. దీంతో ఈరోజు ఉదయం కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా పెళ్లి వేడుక జరిగింది.

హ్యాపీడేస్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన నిఖిల్ కు స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రాలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet