దారుణం: ప్రియుడిపై మోజు.. భర్తను అంతమొందించిన భార్య!

దారుణం:  ప్రియుడిపై మోజు.. భర్తను అంతమొందించిన భార్య!

ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాల కారణంగా జరుగుతున్న నేరాలు బాగా పెరిగి పోయాయి. పరాయి వారి మోజులో పడి.. పచ్చటి సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు. పరాయి వారితో పడక సుఖం కోసం భాగస్వామినే మోసం చేస్తున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే.. ఈ వివాహేతర సంబంధాల్లో మహిళే ఎక్కువగా ఉండటమే కాకుండా దారుణాలు కూడా చేస్తున్నారు. ప్రియుడి మోజులో పడి కట్టుకన్న భర్తను, కన్న పిల్లలను హత్య చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో జరగ్గా తాజాగా మరో దారుణ ఘటన జరిగింది. ప్రియుడిపై మోజుతో తాళి కట్టిన భర్తనే ఓ మహిళ అత్యంత దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కర్ణాటక రాష్ట్రం బెళగావి పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో రమేశ్ కాంబలే(38), సంధ్యా అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల క్రితం పెళ్లి కాగా.. ఎంతో సంతోషంగా  ఉంటున్నారు. అయితే భర్త కుటుంబ పోషణ కోసం బయటకు వెళ్లి వస్తుండే వాడు. ఈ సమయంలో ఇంట్లో సంధ్య ఒంటరిగా ఉండేది. ఈ క్రమంలోనే ఆమె బుద్ధి వక్రమార్గంలోకి వెళ్లింది.  స్థానికంగా ఉండే బాలు బీరెంజే అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది  కాస్త వారిద్దరి మధ్య అక్రమ సంబంధానికి దారి తీసింది. అలా సంధ్యా భర్తకు తెలియకుండా బాలుతో చీకటి సరసాలు చేసేది.

ఈ క్రమంలోనే తరచూ ఇద్దరు కలుస్తుండే వారు. అయితే  తమ ఆనందానికి భర్త రమేష్ అడ్డుగా ఉన్నాడని సంధ్యా భావించింది. తన భర్త అడ్డు తొలగిస్తే.. తన ప్రియుడితో సంతోషంగా ఉండొచ్చని అనుకుంది. దీంతో సంధ్యా మరో ముగ్గురితో కలసి మార్చి 28న భర్తను అత్యంత దారుణంగా హత్య చేసింది. అనంతరం తన భర్త.. పరాయి మహిళతో కలిసి  పారిపోయాడని  కట్టు కథ అల్లి .. ఏప్రిల్ 25న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సంధ్యా వాళ్ల ఇంటిని పరిశీలించారు. ఈ క్రమంలో ఇంట్లో రమేష్ ఫోన్ లభ్యమైంది.

ఫోన్ ఇంట్లో ఉంటే.. రమేష్ ఎలా పారిపోతాడని పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో రమేశ్ భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటకి వచ్చింది. దీంతో సంధ్యాతో పాటు ఆమెకు సహకరించిన ముగ్గురిని పోలీసులు  అరెస్టు చేశారు. చూశారా.. పరాయి వాడితో పడక సుఖం కోసం తాళి కట్టిన భర్తనే హత్య చేసింది ఈ దుర్మార్గురాలు. అలా చేసి చివరకు జైలు పాలైందే తప్ప.. ఏమి సాధించినది లేదు. ఇలా కొందరు మహిళలు.. నిండు ప్రాణాలు బలి తీసి.. జైలు పాలవుతున్నారు. మరి.. ఇలాంటి ఘటనల నివారణకు మీ సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments