iDreamPost
android-app
ios-app

2020లో వీటికి గుడ్ బై చెప్పాల్సిందే

  • Published Apr 12, 2020 | 12:44 PM Updated Updated Apr 12, 2020 | 12:44 PM
2020లో వీటికి గుడ్ బై చెప్పాల్సిందే

కరోనా మహమ్మారి వెళ్ళిపోయి పరిస్థితి మొత్తం నార్మల్ కావడానికి ఎంత టైం పడుతుందో బహుశా ఆ దేవుడికైనా తెలుసా అని అనుమానం వచ్చేలా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి తెలంగాణా లాక్ డౌన్ పొడిగింపు మరో రెండు వారాలు పెంచేసింది. తర్వాత కూడా అంతా సద్దుమణిగితే దశల వారిగా లిఫ్ట్ చేస్తారు తప్ప ఒకేసారి ఎత్తేయరు. దీని సంగతలా ఉంచితే సినిమా పరిశ్రమ దీని దెబ్బకు అతలాకుతలం అయిపోయింది. షూటింగులు, రిలీజులు వాయిదా పడి కోట్ల నష్టం జరిగిపోయింది. లెక్క ఊహకు కూడా అందటం లేదు.

లాక్ డౌన్ తీసేసినా థియేటర్లు మాల్స్ తదితరాలు ఓపెన్ చేయడానికి ఇంకా ఎక్కువే టైం పడొచ్చని గట్టిగా వినిపిస్తున్న మాట. ఇప్పటికే సుమారు 10కు పైగా సినిమాలు విడుదల కోసం ఎదురు చూస్తున్నాయి. క్రేజీ స్టార్ మూవీస్ తో పాటు మీడియం మరియు చిన్న తరహా చిత్రాలు ఈ వరసలో ఉన్నాయి. సరే జూలైకో లేదో ఆగస్ట్ కో ఇదంతా సెట్ అవుతుందనుకున్న మరో షాక్ మాత్రం తప్పేలా లేదు. ఇప్పటిదాకా ప్రమోషన్ లో చాలా కీలకంగా భావించే ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఈ ఏడాది బహుశా జరగకపోవచ్చు. ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చే అవకాశాలు లేవని విశ్లేషకుల అంచనా.

అభిమానుల తాకిడితో విపరీతమైన జన సందోహం ఉంటుంది కాబట్టి పర్మిషన్లు ఇచ్చే విషయంలో సంబంధిత వర్గాలు ఆచితూచి వ్యవహరిస్తాయి. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఇలాంటి పబ్లిక్ ఈవెంట్స్ లో చాలా రిస్క్ ఉంటుంది. పెద్ద హీరో వేడుక అయితే లక్షల్లో వస్తారు. అందరిని చెక్ చేసి శానిటైజ్ చేయడమో లేదా గ్యాప్ మధ్య కూర్చోబెట్టడమో జరగని పని. ఇలాంటి వైరస్ గోల లేని టైంలోనే చాలా సార్లు పరిస్థితి అదుపు తప్పిన సంఘటనలు గతంలో చాలా జరిగాయి. అందుకే నిర్మాతలు సైతం ఇప్పుడున్న సీన్ లో భయపడతారు. సో థియేట్రికల్ రిలీజ్ కు అనుమతులు ఇచ్చినా గప్ చుప్ లో టీవీలో పబ్లిసిటీ ఇచ్చుకోవల్సిందే తప్ప బయట హంగామా చేస్తామంటే కుదరదు. సినిమా అనేది నిత్యావసరం కాదు కాబట్టి ఎవరైనా ఏమి చేయలేరు. కనీసం ఓ నెల ఆగితే గాని దీనికి సంబంధించిన స్పష్టత రాదు.