iDreamPost
కోవిడ్ టైంలో ఖాళీగా ఉన్నామని రాసుకున్న కథలు, విన్న సబ్జెక్టులు ఇప్పుడు పనికిరావని, ఆడియన్స్ సెన్సిబిలిటీస్ లో వచ్చిన మార్పులను గుర్తించకుండా గుడ్డిగా సినిమాలు తీసుకుంటూ వెళ్లడం వల్లే దెబ్బ తింటున్నామని చెప్పారు.
కోవిడ్ టైంలో ఖాళీగా ఉన్నామని రాసుకున్న కథలు, విన్న సబ్జెక్టులు ఇప్పుడు పనికిరావని, ఆడియన్స్ సెన్సిబిలిటీస్ లో వచ్చిన మార్పులను గుర్తించకుండా గుడ్డిగా సినిమాలు తీసుకుంటూ వెళ్లడం వల్లే దెబ్బ తింటున్నామని చెప్పారు.
iDreamPost
ఈ నెల 22న విడుదల కాబోతున్న థాంక్ యు మీద దిల్ రాజు చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో అన్న మాటలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. కోవిడ్ టైంలో ఖాళీగా ఉన్నామని రాసుకున్న కథలు, విన్న సబ్జెక్టులు ఇప్పుడు పనికిరావని, ఆడియన్స్ సెన్సిబిలిటీస్ లో వచ్చిన మార్పులను గుర్తించకుండా గుడ్డిగా సినిమాలు తీసుకుంటూ వెళ్లడం వల్లే దెబ్బ తింటున్నామని చెప్పారు. వ్యక్తిగతంగా ఆయనే పదికి పైగా బడ్జెట్ ప్రాజెక్టులను పక్కన పెట్టేశారంటేనే పరిస్థితిలో ఎంత మార్పు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. షూటింగ్ కు సిద్ధమైన రెండు సినిమాలను సైతం డ్రాప్ అయ్యారంటే తీవ్రత ఎంతగా ఉందో కనిపిస్తుంది.
ఓటిటి వ్యవహారాల గురించి గురించి కూడా రాజు క్లారిటీ ఇచ్చారు. థియేటర్ లో రిలీజ్ చేస్తే వచ్చే కిక్కు డిజిటల్ లో ఉండదని, హాల్లో వచ్చే రెస్పాన్స్, అభిమానుల గోల, ఆడియన్స్ నవ్వులు కన్నీళ్లు, డిస్ట్రిబ్యూటర్ల ఫోన్లు, కలెక్షన్ల గురించిన వార్తలు, సన్నిహితుల నుంచి వచ్చే మెసేజులు ఇవన్నీ ఓటిటిలో మిస్సవుతామని చెప్పుకొచ్చారు. పది వారాల గ్యాప్ అనేది తాను ఫాలో కాబోతున్నానని అంతమాత్రాన ఇది అందరికీ ఒకటే ఫలితాన్ని ఇస్తుందని చెప్పలేమన్నారు. టికెట్ రేట్ల గురించి మాట్లాడుతూ ఎఫ్3కి తగ్గించి ఇప్పుడు థాంక్ యుకి మరింతగా తగ్గింపు ఇవ్వబోతున్నట్టు స్పష్టం చేశారు. హ్యాపీ బర్త్ డేకి అమలు చేసిన రేట్లే ఇప్పుడు చైతు మూవీకి ఇస్తారు.
మొత్తానికి చాలా విషయాలు మాట్లాడిన దిల్ రాజు లాజికల్ గానే ఉన్నారు. హీరోలు నిర్మాణ వ్యయం గురించి ఆలోచిస్తున్నారని ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయో తెలుసుకుంటున్నారని రామ్ చరణ్ ని ఉదాహరణగా చెప్పుకొచ్చారు. ఇక షూటింగుల బందు లాంటివి ఉండబోవని హింట్ కూడా ఇచ్చేశారు. మొత్తానికి కంటెంట్, టికెట్ రేట్, స్టార్ రెమ్యునరేషన్ల గురించి తన అభిప్రాయాలు చెప్పిన దిల్ రాజు ఇకపై ఇండస్ట్రీ పలుమార్పులు ఉంటాయనే సూచన చేశారు. ఇవన్నీ జరిగితే మంచిదే. థియేటర్ కు ప్రేక్షకుడు క్రమంగా దూరమవుతున్న తరుణంలో ఇలాంటి చర్యలు చాలా అవసరం. అప్పుడే కలెక్షన్లు పెరిగి వ్యవస్థ పచ్చగా ఉంటుంది .