iDreamPost
android-app
ios-app

నాగ చైతన్య , శోభిత పెళ్లి ముహూర్తం ఫిక్స్..!

  • Published Oct 30, 2024 | 5:33 PM Updated Updated Oct 30, 2024 | 5:33 PM

Naga Chaitanya, sobhita wedding date: అక్కినేని వారి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. రీసెంట్ గా నిశ్చితార్థం చేసుకున్న నాగ చైతన్య శోభిత ల పెళ్లి మూహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది . దానికి సంబంధించింన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Naga Chaitanya, sobhita wedding date: అక్కినేని వారి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. రీసెంట్ గా నిశ్చితార్థం చేసుకున్న నాగ చైతన్య శోభిత ల పెళ్లి మూహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది . దానికి సంబంధించింన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Oct 30, 2024 | 5:33 PMUpdated Oct 30, 2024 | 5:33 PM
నాగ చైతన్య , శోభిత పెళ్లి ముహూర్తం ఫిక్స్..!

అక్కినేని నాగ చైతన్య .. నటి శోభిత ధూళిపాళ్లను త్వరలో వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరిద్దరికి కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరిగింది. ఆగస్ట్ 8 న ఈ జంట చాలా సింపుల్ గా నిశ్చితార్థం చేసుకున్నారు. రీసెంట్ గా కూడా సోషల్ మీడియాలో వారికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసారు. దీనితో వీరిద్దరి పెళ్లి ఇప్పుడా అని అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరి పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. వచ్చే డిసెంబర్ లో నాగ చైతన్య – శోభిత ఇద్దరు పెళ్లి పీఠలు ఎక్కబోతున్నట్లు సమాచారం. సో త్వరలోనే వివాహబంధంలోకి ఈ జంట అడుగుపెట్టనున్నారు.

తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. డిసెంబర్ 4 వారి పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 2న సంగీత్ , మూడవ తేదీ మెహందీ.. నాలుగవ తేదీ పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ఇక పెళ్లి తర్వాత డిసెంబర్ 10న గ్రాండ్ గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో జరిగిన అక్కినేని నాగేశ్వరరావు నేషనల్ అవార్డ్స్ 2024 వేడుకలలో భాగంగా.. ఈ విషయం బయటకు వచ్చింది. త్వరలోనే వారు కూడా ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించనున్నారు. ఎంగేజ్మెంట్ లానే పెళ్ళికి కూడా చాలా తక్కువ మందిని పిలవబోతున్నట్లు సమాచారాం. అయితే వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారా.. లేక హైదరాబాద్ లోనే వెడ్డింగ్ చేసుకుంటారా? అనే దానిపై ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. రాజస్థాన్ లో నాగ చైతన్య- శోభిత ధూళిపాళ వివాహం జరగనుందట. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఇక రీసెంట్ గా శోభిత పసుపు దంచే కార్యక్రమానికి సంబంధించిన ఫొటోస్ ను కూడా షేర్ చేశారు. ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇక వీరిద్దరి సినిమాల విషయానికొస్తే.. నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ మూవీ పనుల్లో బిజీగా ఉన్నాడు. అటు శోభితా ధూళిపాళ్ల కు సంబంధించిన లవ్ సితార సినిమా కూడా రీసెంట్ గా.. ఓటీటీ లో రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక వీరిద్దరూ కలిసి ఎప్పుడు నటిస్తారా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మరి నాగ చైతన్య – శోభిత పెళ్లి ముహూర్తం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobetjojobet girişjojobetjojobet girişjojobetjojobet girişjojobet güncel giriş