iDreamPost
android-app
ios-app

శంకర్ గేమ్ చెంజర్ పోస్టర్స్ లోనే స్టోరీ హింట్ ఇచ్చాడుగా..!

  • Published Nov 06, 2024 | 12:28 PM Updated Updated Nov 06, 2024 | 12:28 PM

Game Changer Movie: గేమ్ ఛేంజర్ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఇప్పటివరకు రావాల్సిన హైప్ అయితే ఇంకా రావడం లేదు. కానీ దర్శకుడు మాత్రం పక్కా ప్లానింగ్ తో పోస్టర్స్ ను రిలీజ్ చేశాడు. దాని వెనుక ఉండే కథ కూడా అదే రేంజ్ లో ఉంది. అదేంటో చూసేద్దాం.

Game Changer Movie: గేమ్ ఛేంజర్ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఇప్పటివరకు రావాల్సిన హైప్ అయితే ఇంకా రావడం లేదు. కానీ దర్శకుడు మాత్రం పక్కా ప్లానింగ్ తో పోస్టర్స్ ను రిలీజ్ చేశాడు. దాని వెనుక ఉండే కథ కూడా అదే రేంజ్ లో ఉంది. అదేంటో చూసేద్దాం.

  • Published Nov 06, 2024 | 12:28 PMUpdated Nov 06, 2024 | 12:28 PM
శంకర్ గేమ్ చెంజర్ పోస్టర్స్ లోనే స్టోరీ హింట్ ఇచ్చాడుగా..!

మరి కొద్ది రోజుల్లో గేమ్ ఛేంజర్ టీజర్ రాబోతుంది. ఇప్పటికే టీజర్ కట్ కూడా పూర్తయినట్లు సమాచారం. ఒక్కసారి టీజర్ పడితే.. అప్పుడు కానీ గేమ్ ఛేంజర్ అసలు ఆట మొదలవ్వదు. ఎప్పటినుంచో వినిపిస్తున్న సినిమా అయినా కానీ… ఇప్పటివరకు సినిమాకు రావాల్సిన సరైన హైప్ మాత్రం ఇంకా రావడం లేదు. దానికి వెనుక గల కారణాలు అందరికి తెలిసిందే. కానీ ఇకపై  గేమ్ చెంజర్ విషయంలో ఎలాంటి నెగెటివిటి ఉండకూడదని.. శంకర్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు. ప్రమోషన్స్ కోసం ఇప్పటికే పక్కా ప్లానింగ్ ను రెడీ చేసాడు. టీజర్ ,ట్రైలర్స్ ఎప్పుడు ఎక్కడ రిలీజ్ చేయాలి. ప్రమోషన్స్ ఏ ప్లేస్ లో చేస్తే ప్లస్ అవుతుంది.. ఇలా ఓ ప్లానింగ్ ఓ పద్ధతి అంటూ స్కెచ్ వేసాడు శంకర్. నిజానికి శంకర్ మొదటి పోస్టర్ రిలీజ్ చేసినప్పటినుంచే పక్కా ప్లాన్ తో ఉన్నాడు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్ తో కథ ఎలా ఉంటుందనే హింట్ కూడా ఇచ్చేశాడు.

గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటివరకు మొత్తం ఆరు పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా ఒక  పాట్రన్ లో రిలీజ్ అవుతూ వచ్చాయి. అంటే మొదటి పోస్టర్ ను గమనిస్తే చరణ్ బ్యాక్ లుక్ ను వదిలారు. ఆ తర్వాత ఫ్రంట్ లుక్ రివీల్ చేశారు. ఇలా మొత్తం ఆరు పోస్టర్స్ కూడా… ఒక దాని తర్వాత ఒకటి బ్యాక్ అండ్ ఫ్రంట్ షాట్స్ ను రివీల్ చేశారు. దీనిని బట్టి చూస్తే సినిమాలో కూడా కథను పాస్ట్ ప్రెసెంట్ ను కలిపి చూపిస్తారేమో అని సినీ ప్రియులు ఊహాగానాలు మొదలుపెట్టారు. ఆ ఊహలు నిజం అయ్యే అవకాశం కూడా అంతే ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ అనే విషయం తెలిసిందే. అందులోను కథ కార్తీక్ సుబ్బరాజ్ ది. ఈయన కథలన్నీ కూడా కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరు. దానికి శంకర్ టేకింగ్ , చరణ్ స్క్రీన్ ప్రెజన్స్ యాడ్ అయితే ఇక సినిమా నెక్స్ట్ లెవెల్. ఇక అప్డేట్స్ లో కూడా క్లాస్ , మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ రెండిటిని చూపించారు. సో ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమా గట్టి ఇంపాక్ట్ ను క్రియేట్ చేసేలా ఉంది.

కాలం కలిసి రాక ఇప్పటివరకు సినిమా గురించి అంచనాలు తారు మారు అవుతున్నాయి. కానీ సరిగ్గా చూస్తే శంకర్ గేమ్ ఛేంజర్ విషయంలో చాలా గట్టిగానే ప్లాన్ చేసాడు. పెద్దగా కంటెంట్ బయటకు రాకపోయినా కూడా.. సినిమా మీద బజ్ ఓ విధంగా బాగానే ఉంది. ఇక ఆ టీజర్ , ట్రైలర్ కాస్త రిలీజ్ అయితే అప్పుడు అంచనాలు నిలబడే అవకాశం ఉంది. అటు మెగా అభిమానులతో పాటు మూవీ లవర్స్ అంతా కూడా గేమ్ ఛేంజర్ కోసం అంతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సరిగ్గా చూస్తే గేమ్ చెంజర్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర  తన మార్క్ చూపించేలా కనిపిస్తుంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.