iDreamPost
iDreamPost
వారసుడు విడుదల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తమిళనాడులోనూ నిర్మాత దిల్ రాజుకు పెద్ద సవాల్ గా మారింది. ఇక్కడేమో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకు థియేటర్లు తగ్గించేసి డబ్బింగ్ సినిమాలు వేసుకుంటున్నారనే వివాదం నలుగుతోంది. ఇది చాలదన్నట్టు ఇటీవలే ఓ ఇంటర్వ్యూ విజయ్ నెంబర్ వన్, అతనికి ఎక్కువ స్క్రీన్లు రావాలని దిల్ రాజు చేసిన కామెంట్లు అజిత్ ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పించాయి. తునివుని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఉదయనిధి స్టాలిన్ కి కలుసుకుని అదనంగా ఇమ్మని కోరతానని చెప్పడం వాళ్ళ నిరసకు కారణమవుతోంది. ఎప్పటి నుంచో విజయ్ అజిత్ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ ఓ రేంజ్ లో ఉన్న సంగతి తెలిసిందే.
మార్కెట్ లెక్కలు కాసేపు పక్కనపెడితే దిల్ రాజు యధాలాపంగా అన్న మాటలు బయటికి విపరీతార్థంలో వెళ్లిపోయాయి. ఆయనింకా చెన్నై వెళ్లకపోయినా అదే పనిగా వరిసుకు ఎక్స్ ట్రా స్క్రీన్లు ఇవ్వడం కోసం తునివుకి తగ్గించే ఛాన్స్ ఉండదు. మొత్తం ఎనిమిది వందల థియేటర్లలో చెరో నాలుగు వందలు సమంగా పంచేలా అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ఒక ఒప్పందానికి వచ్చారు. కానీ అలా చేస్తే తాను నష్టపోతానని దిల్ రాజు అంటున్నారు. ఈ సమస్య ఎలా పరిష్కారమవుతుందోనని బయ్యర్ల వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. తన మాటలను వక్రీకరించారని దిల్ రాజు అంటున్నప్పటికీ వీడియో సాక్ష్యం బలంగా ఉండటంతో సమర్ధించలేని పరిస్థితి
ఇంకో పాతిక రోజుల్లో సంక్రాంతి రాబోతోంది. ఈలోగా ఇవన్నీ సెట్ అయిపోవాలి. తెరవెనుక వ్యవహారాల్లో మాత్రం వారసుడుకి ఎక్కువ థియేటర్లు వస్తున్నాయని కొందరు నెటిజెన్ల పేర్లతో సహా లిస్టు పెట్టేయడంతో కొత్త డిస్కషన్ మొదలైంది. రెండు మూడు స్క్రీన్లు మాత్రమే ఉండే బిసి సెంటర్స్ లో ఇప్పుడీ పోటీ వల్ల ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉన్నది వాల్తేర్ వీరయ్యకే. పన్నెండునే వచ్చే వీరసింహారెడ్డి, వారసుడుల ఎక్కువ కౌంట్ వస్తే అంధులో నుంచే చిరు మూవీకి పంచాల్సి ఉంటుంది. మొత్తానికి తెరమీద సినిమా కన్నా బయట డ్రామా ఎక్కువ పండుతోంది. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ల తాలూకు డేట్లు వేదికలు ఖరారు చేయాల్సి ఉంది