iDreamPost
android-app
ios-app

ఆస్పత్రిలో చేరిన స్టార్ హీరో అజిత్ భార్య షాలిని! ఏమైందంటే…

  • Published Jul 03, 2024 | 5:22 PM Updated Updated Jul 03, 2024 | 5:22 PM

Ajith Wife Shalini In Hospital: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఆయన ఓ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఆయన భార్య ఆస్పత్రిలో చేరింది.

Ajith Wife Shalini In Hospital: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఆయన ఓ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఆయన భార్య ఆస్పత్రిలో చేరింది.

  • Published Jul 03, 2024 | 5:22 PMUpdated Jul 03, 2024 | 5:22 PM
ఆస్పత్రిలో చేరిన స్టార్ హీరో అజిత్ భార్య షాలిని! ఏమైందంటే…

సినీ ఇండస్ట్రికి సంబంధించిన వార్తలను తెలుసుకునేందుకు జనాలు ఆసక్తి చూపిస్తుంటారు. అలానే సెలబ్రిటీలు కూడా తమకు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటారు. కేవలం వారి సంతోషకరమైన విషయాలే కాకుండా ఆరోగ్యానికి  సంబంధించిన వాటిని కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటారు. ఇటీవలే ఓ హీరోయిన్ తనకు క్యాన్సర్ ఉన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అంతేకాక అది ఏ స్టేజ్ లో ఉందనే వివరాలు తెలియజేసింది. ఇది ఇలా ఉంటే..తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ భార్య ఆస్పత్రిలో ఉన్న ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ ఫిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళనాట టాప్ హీరోల్లో ఒకరిగా అజిత్ కొనసాగుతున్నారు. ఎంత మంది యంగ్ హీరోలు వచ్చినా సరే.. అజిత్ ఉండే క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అనేక విభిన్నమైన సినిమాల్లో నటించి..ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక వెరైటీ పాత్రల్లో నటించేందుకు అజిత్ ఎప్పుడూ ముందుకు ఉంటారు. ప్రస్తుతం విడాముయర్చి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీ షూటింగ్‌లో ఆయన బిజీగా ఉన్నారు. ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను లైకా ప్రోడక్షన్స్‌పై మగిళ్‌ తిరుమేని తెరకెక్కిస్తున్నారు. అలానే సుభాస్కరన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి అజిత్‌ ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగాయి. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందానా అని ఆయన ఫ్యాన్స్, ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇది ఇలా ఉంటే.. అజిత్ భార్య ఒకప్పటి హీరోయిన్ షాలిని ఆస్పత్రిలో చేరారు. అజిత్ పక్కనే తాను ఉన్న ఫోటోను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది.  అంతేకాక లవ్‌ యూ ఫరెవర్‌ అంటూ క్యాప్షన్‌ కూడా జోడించింది. షాలినికి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చిన్నపాటి సర్జరీ జరిగిందని తెలుస్తోంది. మంగళవారం అజిత్ అజర్‌బైజాన్ నుండి చెన్నైకి వచ్చాడు. సర్జరీ చేయించుకున్న తన భార్యకు ధైర్యం అందించాడు. అయితే ఆమెకు ఏమైందని అజిత్ అభిమానులు ఆరా తీస్తున్నారు. ఆమెకు ఏ ఆరోగ్య సమస్యపై ఆపరేషన్ జరిగిందా ఆరా తీస్తున్నారు.

ఇక షాలిని విషయానికి వస్తే.. ఆమె 1980లోనే బాలనటిగా చిత్ర పరిశ్రమలోకి అరంగ్రేటం చేసింది. ఆమె 90వ దశకంలో టాలీవుడ్,కోలివుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించింది. మణిరత్నం  దర్శకత్వం వహించిన అలై పాయుతే సినిమాతో ఆమె క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగింది. ఆ సినిమాతో ఆమెకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. 2000లో విడుదలైన ఈ రొమాంటిక్  సినిమా ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది. 1999లో అమర్కలం సినిమా షూటింగ్ సమయంలో షాలిని, అజిత్‌లు కలుసుకుని ప్రేమలో పడ్డారు. వారి లవ్ కాస్తా పెళ్లి పీటల వరకు వెళ్లింది. ఈ  జంట 2000 ఏప్రిల్ 24న వివాహం చేసుకున్నారు.  వివాహం తరువాత షాలిని నటన నుండి పూర్తిగా విరమించుకున్నారు. మొత్తంగా తాజాగా ఆమె ఆస్పత్రి బెడ్ పై ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Shalini Ajith Kumar (@shaliniajithkumar2022)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş