iDreamPost
android-app
ios-app

Porsche GT3: అజిత్ గ్యారేజిలో మరో సూపర్ స్పోర్ట్స్ కార్.. దీని స్పీడుకి కళ్ళు తిరగాల్సిందే!

  • Published Sep 14, 2024 | 5:34 PM Updated Updated Sep 14, 2024 | 5:34 PM

Porsche GT3: తాజాగా అజిత్ మరో సూపర్ లగ్జరీ కార్ కొన్నారు. ఈ విషయాన్ని షాలిని అభిమానులతో పంచుకున్నారు.

Porsche GT3: తాజాగా అజిత్ మరో సూపర్ లగ్జరీ కార్ కొన్నారు. ఈ విషయాన్ని షాలిని అభిమానులతో పంచుకున్నారు.

  • Published Sep 14, 2024 | 5:34 PMUpdated Sep 14, 2024 | 5:34 PM
Porsche GT3: అజిత్ గ్యారేజిలో మరో సూపర్ స్పోర్ట్స్ కార్.. దీని స్పీడుకి కళ్ళు తిరగాల్సిందే!

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా దూసుకుపోతున్నారు. అజిత్ రూటే సెపరేటు. ఆయన సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటారు. సినిమాలు చేసుకుంటూ తనకు ఇష్టమైన పనులు చేస్తుంటారు. అజిత్ కి ఎంతో ఇష్టమైన పని రేసింగ్. ఆయనకి స్పోర్ట్స్ కార్లు, స్పోర్ట్స్  బైకులు అంటే మహా పిచ్చి. ఖాళీ దొరికితే చాలు వాటితో అడ్వెంచర్స్ చేస్తుంటారు. అజిత్ గ్యారేజిలో స్పోర్ట్స్ కార్స్, బైక్స్ చాలానే ఉన్నాయి. ఇక తాజాగా అజిత్ మరో సూపర్ లగ్జరీ కార్ కొన్నారు. ఈ విషయాన్ని అజిత్ భార్య మాజీ హీరోయిన్ షాలిని అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్ట్ కి “ఆయన కారును, స్టైల్​ను, నా హృదయాన్ని గెలుచుకున్నారు” అనే క్యాప్షన్ పెట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అజిత్ కొన్నకొత్త  కార్ ఏంటి? దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

అజిత్​ తాజాగా కొనుగోలు చేసిన కార్ పేరు  పోర్షె 911 జీటీ3 ఆర్ఎస్. ఇది ఓ సూపర్ లగ్జరీ స్పోర్ట్స్ కార్. ఈ కారు ధర ఏకంగా రూ. 3.51 కోట్లు ఉంటుందని సమాచారం తెలుస్తుంది. ఈ కారు స్పీడ్ విషయానికి వస్తే.. ఏకంగా  గంటకు 296 కి.మీ. మాక్సిమమ్ స్పీడ్ తో శరవేగంగా దూసుకువెళ్లగలదు. ఈ కార్ కేవలం 3.2 సెకన్లలో గంటకు ఏకంగా సున్నా నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్ ని అందుకోలగలదు. ఇక  గత నెలలో కూడా  అజిత్ దుబాయ్​లో మరో లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో ఈ కారును కొన్నారు. ఇది గంటకు గరిష్ఠంగా 340కి.మీ వేగంతో దూసుకుపోగలదు. ఇంకా అజిత్​ గ్యారేజీలో రూ.4 కోట్ల ఫెరారీ 458 ఇటాలియా, రూ.1.3 కోట్ల ల్యాండ్ రోవర్ డిస్కవరీ, రూ.1.5 కోట్ల బీఎండబ్ల్యూ 740 లీ, రూ.1.35 కోట్ల మెర్సెడీస్ బెంజ్ 350 జీఎల్ఎస్, రూ.90 లక్షల వోల్వో ఎక్స్‌సీ 90 వంటి సూపర్ కార్లు ఉన్నాయి. అలాగే రూ.24 లక్షల బీఎండబ్ల్యూ ఎస్1000ఆర్ఆర్, రూ.20 లక్షల అప్రిలియా కాపోనోర్డ్ 1200, రూ.21 లక్షల బీఎండబ్ల్యూ కే1300 ఎస్, రూ.19.7 లక్షల కవాసకీ నింజా జెడ్ఎక్స్ 14ఆర్​ వంటి సూపర్ బైక్ లు కూడా ఉన్నాయి.

ఇక అజిత్ సినిమాల విషయానికి వస్తే..  చివరిగా అజిత్ గతేడాది ‘తునివు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన ‘విదాముయార్చి’ సినిమాతో పాటు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే సినిమా కూడా చేస్తున్నారు.. విదాముయార్చి సినిమాకి మాగిజ్‌ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అజిత్‌ సరసన త్రిష హీరోయిన్ గా  నటిస్తున్నారు. తెలుగు స్టార్  మ్యూజిక్ డైరెక్టర్  దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇక గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి అయితే అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకి కూడా దేవీశ్రీ ప్రసాదే సంగీతం అందించడం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ గతంలో అజిత్ ‘వీరం’ సినిమాని సంగీతం అందించారు. ఇక తాజాగా అజిత్ కుమార్ తాజాగా కొన్న పోర్షె 911 జీటీ3 ఆర్ఎస్ కార్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 

 

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş