iDreamPost
android-app
ios-app

జగన్ ప్రభుత్వం బంప‌రాఫ‌ర్.. మ‌ళ్లీ బ‌డికి 90 వేల మంది విద్యార్ధులు!

జగన్ ప్రభుత్వం బంప‌రాఫ‌ర్.. మ‌ళ్లీ బ‌డికి 90 వేల మంది విద్యార్ధులు!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. చదువే పిల్లలకు నిజమైన ఆస్తి అని బలంగా నమ్మిన వ్యక్తి సీఎం జగన్. అందుకే విద్యార్థుల కోసం అనేక రకాల పథకాలను ప్రవేశ పెట్టారు.  అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, విదేశీ విద్యా, జగనన్న విద్యా కానుక వంటి పలు పథకాలతో పిల్లలకు మంచి విద్యాను అందిస్తున్నారు. తాజాగా పదో తరగతి ఫెయిలైన విద్యార్థుల విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.

బ‌డిఈడు పిల్లలంతా బ‌డిలోనే ఉండాలి.. ప‌దో త‌ర‌గ‌తి త‌ర్వాత కూడా చ‌దువు మానేయ‌కూడ‌దు.. అంతేకాదు పదో తరగతి ఫెయిలైనా బడిలోనే ఉండాలంటూ ఏపీ సర్కార్ పేర్కొంది. ఈ క్రమంలోనే ఈసారి కొత్త నిబంధ‌న అమ‌ల్లోకి తెచ్చింది జగన్ స‌ర్కార్. ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్షల్లో, ఇంట‌ర్మీడియ‌ట్ ఫెయిలైన విద్యార్ధులు.. తిరిగి పాఠ‌శాల లేదా కాలేజీలో చేరే అవ‌కాశాన్ని క‌ల్పించింది. పది, ఇంట‌ర్‌లో రీఅడ్మిష‌న్ విధానం ద్వారా విద్యార్ధుల‌కు మరోసారి చదువుకునే అవ‌కాశాన్ని కల్పించింది. గ‌తేడాది వ‌ర‌కూ ప‌దో త‌ర‌గ‌తి పాసుకానీ విద్యార్థులు స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షల్లో లేదా ఏడాది ఆగి మ‌ళ్లీ ప‌రీక్షలు రాయాల్సి వచ్చేది. అలానే ఒక‌సారి టెన్త్ చ‌దివిన విద్యార్థులు మ‌ళ్లీ బ‌డిలోకి వెళ్లి చ‌దువుకునే అవ‌కాశం ఉండేది కాదు.

కానీ దీని ద్వారా ఒక‌సారి ఫెయిలైన విద్యార్థులకు స‌రైన శిక్షణ లేక ఇబ్బంది పడేవారు. అయితే గ‌తేడాది టెన్త్‌లో ఫెయిలైన విద్యార్ధుల‌ను ఈ ఏడాది ప్రభుత్వ పాఠ‌శాలల్లో రీఅడ్మిష‌న్ క‌ల్పిస్తూ జగన్ సర్కార్ మరోసారి చదువుకునేందుకు అవకాశమిచ్చింది. గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల సిబ్బంది, వాలంటీర్ల ద్వారా ప‌దో త‌ర‌గ‌తిలో ఉత్తీర్ణ సాధించిన విద్యార్ధుల‌ను గుర్తించి తిరిగి బడుల్లో చేర్పించింది. కేవ‌లం పదో త‌ర‌గ‌తి మాత్రమే కాదు.. ఇంట‌ర్‌లోనూ ఇదే విధానాన్ని అనుసరించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టి.. సఫలికృతమైంది. 88 వేల 342 మంది ఫెయిలైన విద్యార్థుల‌కు తిరిగి టెన్త్ క్లాస్‌లో అడ్మిష‌న్లు ఇప్పించారు. ఇలా ఇంట‌ర్ లో కూడా చాలామంది విద్యార్థుల‌కు రీఅడ్మిష‌న్ కల్పించినట్లు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. మరి.. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయంపై  మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి