iDreamPost

డిసెంబర్‌లోగా విశాఖకు షిఫ్ట్.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు!

డిసెంబర్‌లోగా విశాఖకు షిఫ్ట్.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతూ వచ్చారు. గత ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచచిన హామీలు నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ది బాటలో నడిపిస్తున్నారు. ప్రతిపక్ష నేతలు ఎన్ని విమర్శలు చేసినా.. వాటిని పట్టించుకోకుండా తొమ్మిది నవరత్న సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తున్నారు. అంతేకాదు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రంలో పలు కంపెనీలు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఇందు కోసం రాష్ట్రంలో పెట్టుబడులు ఆహ్వానించి పెద్ద కంపెనీలు ఏర్పాటుకు ఎంతగానో కృషి చేస్తున్నారు. సోమవారం విశాఖ పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్. జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..

ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం విశాఖ్య పర్యటనలో భాగంగా రుషికొండలో ఐటీ దిగ్గజం అయిన ఇన్ఫోసిస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్, బెంగుళూరు లాంటి నగరాల్లో ఉన్న సదుపాయాలు, అవకాశాలు వైజాగ్ లో కూడా ఉన్నాయి. విశాఖ పట్నం కూడా గొప్ప ఐటీ హబ్ గా మారుతుంది. ఇప్పటికే విశాఖ విద్యాసంస్థలకు కేంద్రంగా మారిన విషయం తెలిసిందే.. ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి 15 వేల మంది ఇంజనీర్లు తయారవుతున్నారు. రాష్ట్రంలోనే విశాఖ అతిపెద్ద నగరం. విశాఖ పొడవైన తీర ప్రాంతం, అంతర్జాతీయ విమానాశ్రయం, వాణిజ్య పరంగా ఎంతో అభివృద్ది సాధిస్తుంది. ఇన్ని అద్బుతమైన సౌకర్యాలు ఉండటం వల్లనే విదేశాల నుంచి అనేక సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు’ అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపించే కంపెనీలు ఒక్క కాల్ చేస్తే చాలు.. వారికి కావాల్సిన సదుపాయాలన్నీ సమకూర్చుతాం.. అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తాం అని హామీ ఇచ్చారు. అంతేకాదు త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన అందించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం విశాఖకు షిఫ్ట్ అవుతున్నాం. పరిపాలన విభాగం మొత్తం విశాఖకు మారబోతుంది. ఈ ఏడాది చివరల్లో అంటే డిసెంబర్ లో విశాఖకు మారుతాను’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఇన్పోసిస్ అధికారులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో హైబ్రీడ్ వర్కింగ్ మోడల్ లో 1000 మందికి పైగా ఉద్యోగావకాశాలు వస్తాయని తెలిపారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ లో ఐటీ నిపుణులకు కొదవే లేదు అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి