యు ట్యూబ్ లో – తెలుగు జోరు.

స్మార్ట్ ఫోన్లు రాకతో దేశంలో మొబైల్ డేటా వినియొగం భారీగా పెరిందని తాత్కాలిక ఆర్ధిక మంత్రి పీయూష్‌ గోయల్‌ గత ఫిబ్రవరీలో పార్లమెంట్లో చెప్పిన విషయం తెలిసిందే. 2014లో భారతీయ కస్టమర్లు 82.8 కోట్ల గిగాబైట్స్‌ (జీబీ) డేటా వాడితే.. 2018 వచ్చే సరికి ఇది 4,640 కోట్ల జీబీకి చేరిందని తాజాగ ట్రాయ్‌ లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు ఒక ప్రముఖ సంస్థ విడుదల చెసిన సర్వే ప్రకారం భారత దేశంలో మొబైల్ ఫొన్లో నచ్చిన వీడియొలు చూసేందుకే ప్రజలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రతి మొబైల్ వినియొగదారుడు రోజుకు సగటున 67 నిమిషాలు వీడియొలు చూడటానికే సమయం వెచ్చిస్తునట్టు వెల్లడించింది. 2012 లో కేవలం రెండు నిమిషాలు మాత్రమే వీడియొలకు కేటాయించగా ఇప్పుడు రోజుకు ఏకంగా గంటకు పైగా వీడియొలు చూడటానికే సమయం కేటాయిస్తున్నట్టు ఆ సంస్థ తెలిపింది. వీడియొలు చూసేందుకు దేశంలో ఎక్కువమంది యు ట్యుబ్ ని అనుసరిస్తుండగా, ఆ తరువాత స్థానాలలో (హాట్ స్టార్, జియొ టి.వి, ప్రైం వీడియొ) యాప్స్ ఉన్నాయని చెప్పుకొచ్చింది.

టెలికాం రంగంలో సంచ‌లనం సృష్టిస్తూ రిలయన్స్ సంస్థ జియొని వినియొగదారులకు అందుభాటులోకి తేవటంతో, దేశంలో డెటా వినియొగం ఒక్కసారిగా పెరిగినట్లు పలు సర్వేలు స్పష్టం చెస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచంలో ఏ టెలికాం కంపెనీ కూడా అతి త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ వినియోగ‌దారుల‌ను చేర్చుకోలేక‌పోయింది. కానీ ఆ ఘ‌న‌త‌ను జియో సాధించింది. జియోకు ముందు భార‌త్ మొబైల్ డేటా వినియోగంలో 155వ స్థానంలో ఉండగా ఇప్పుడు ఏకంగా నంబ‌ర్ 1 స్థానానికి ఎగ‌బాకింది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ప్లాన్ల‌ను ప్ర‌వేశ‌పెడుతూ జియో యూజ‌ర్ల‌ను ఆక‌ర్షిస్తూ ఉండటం దాని ప్రభావం ఇతర సంస్థలపై పడటంతో డేటా ధరలు దిగి రాక తప్పలేదు. ఇదే కాకుండా హైస్పీడ్ 4జీ నెట్‌వ‌ర్క్‌తో టెలికాం రంగంలో జియో సునామీని సృష్టించింది దీంతో 2016లో నెలకు సగటున 20కోట్ల జి.బి గా ఉన్న డేటా వినియొగం 2018 నాటికి ఏకంగా 370 కోట్ల జిబీకి చేరింది. ఇది 2019 సెప్టెంబర్ చివరికి 5491 కోట్ల జి.బీ డేటాను వాడినట్లు టెలికాం రెగ్యులేటరి సంస్థ (ట్రాయి) స్పష్టం చేసింది.

భారత దేశంలో వివిద ప్రాంతీయ భాషల వీడియొల విషయానికి వస్తే తెలుగు భాష వీడియొలకు అత్యధిక డిమాండ్ ఉన్నట్లు “విడూలీ” సంస్థ తన నివేదికలో పెర్కొంది. తెలుగు వీడియెలకు విక్షకుల నుండి ఎక్కువ ఆధరణ ఉందని యుట్యుబ్ లో అప్లొడ్ అయ్యే వీడియొలలో తెలుగువే అత్యధికంగా ఉంటున్నాయని ప్రాంతియ భాషలో 2016లో తెలుగు వీడియెలను 1,270 కోట్ల సార్లు చూస్తే 2018 వచ్చేసరికి తెలుగు వీడియెలను 6,740 కోట్ల సార్లు చూడటంతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని ఆ తరువాత స్థానంలో తమిళ , పంజాబి, మళయాల , బోజ్ పూరి వీడియొలు ఉన్నాయని, తెలుగు వార్తా చానళ్ళు, సినీరంగ విషయాలకు ఆధరణ లభిస్తున్నదని ఇక 5జీ రంగ ప్రవేశం చెస్తే డేటా వినియొగం హోరుఎత్తుతోదని తన నివేదికలో పేర్కోంది విడూలీ సంస్థ.

Show comments