iDreamPost
android-app
ios-app

మీరు డేటా ఎక్కువ వాడుతారా?జియో నుంచి క్రేజీ ప్లాన్.. 90 రోజుల వ్యాలిడిటీ.. ధర తక్కువే

  • Published Oct 18, 2024 | 5:24 PM Updated Updated Oct 18, 2024 | 5:24 PM

JIO 5G recharge plan: మీరు తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ అందించే రీచార్జ్ ప్లాన్స్ కోసం చూస్తున్నారా? అయితే జియో అందించే ఈ ప్లాన్ తో ఏకంగా 90 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. ధర కూడా తక్కువే.

JIO 5G recharge plan: మీరు తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ అందించే రీచార్జ్ ప్లాన్స్ కోసం చూస్తున్నారా? అయితే జియో అందించే ఈ ప్లాన్ తో ఏకంగా 90 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. ధర కూడా తక్కువే.

  • Published Oct 18, 2024 | 5:24 PMUpdated Oct 18, 2024 | 5:24 PM
మీరు డేటా ఎక్కువ వాడుతారా?జియో నుంచి క్రేజీ ప్లాన్.. 90 రోజుల వ్యాలిడిటీ.. ధర తక్కువే

టెలికాం కంపెనీలు టారీఫ్ ధరలు భారీగా పెంచిన విషయం తెలిసిందే. జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా ఇలా అన్ని కంపెనీలు ధరలు పెంచి యూజర్లకు షాకిచ్చాయి. దీంతో మొబైల్ వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రీచార్జ్ ధరల పెంపుతో అదనపు ఆర్థిక భారం తప్పడం లేదు. ఓ వైపు నిత్యావసర ధరలు పెరగడం మరో వైపు రీచార్జ్ ధరలు కూడా పెంచడంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అయిపోయింది. రెండు సిమ్ లు వాడే వారికి ఇది మరింత భారం అయిపోయింది. ఫోన్ రీచార్జ్ చేయకపోతే ఇన్ కమింగ్ కాల్స్ కూడా ఆగిపోయే పరిస్థితి. కాబట్టి కచ్చితంగా రీచార్జ్ చేయించాల్సిందే. డేటా ఎక్కువగా వినియోగించే వారికి అదనపు డేటా కోసం రీచార్జులు తప్పడం లేదు.

ఈ నేపథ్యంలో తక్కువ రీఛార్జ్ ధరలు ఎక్కువ బెనిఫిట్స్ అందించే నెట్ వర్క్ లకు మారేందుకు రెడీ అయిపోయారు. ఈ పరిస్థితుల్లో కస్టమర్లను కాపాడుకునేందుకు దిద్దుబాటు చర్యలను ప్రారంభించాయి. చౌక ధరలతో రీచార్జ్ ప్లాన్స్ ను ప్రవేశపెడుతున్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు తక్కువ ధరలతో రీచార్జ్ ప్లాన్స్ ను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో రిలయన్స్ జియో తన యూజర్ల కోసం క్రేజీ ప్లాన్ ను తీసుకొచ్చింది. డేటా ఎక్కువగా వినియోగించే వారికి ఇదే బెస్ట్ ప్లాన్ గా చెప్పొచ్చు. తాజాగా 5జీ రీఛార్జ్ ప్లాన్ ను రిలయన్స్ జియో ప్రకటించింది. కేవలం 899కే 5జీ డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే 90 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. 200 GB 5G డేటా పొందొచ్చు.

ఇది స్ట్రీమింగ్, గేమింగ్ లేదా బ్రౌజింగ్ కోసం ఎక్కువ డేటా వాడే 5జీ యూజర్లకు బెస్ట్ రీచార్జ్ ప్లాన్ గా చెప్పొచ్చు. 899తో రీచార్జ్ చేసుకుంటే 90 రోజులు అన్ లిమిటెడ్ కాల్స్, 100 ఉచిత SMS, 180 GB డేటా పొందుతారు. అంటే డైలీ 2జీబీ డేటా వస్తుంది. ఇంకా ఎక్ట్ర్సా బోనస్ గా 20 జీబీ డేటా మీకు లభిస్తోంది. 5G ప్లాన్ సెగ్మెంట్‌లో ఇది బెస్ట్ ప్లాన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంత తక్కువ ధరలో 4జీ డేటా మాత్రమే అందుబాటులో ఉండేది. 899కే 5జీ డేటా రావడం అనేది యూజర్లకు బెనిఫిట్ అనే చెప్పాలి. అంతేకాదు ఈ ప్లాన్ పై ఎక్ట్ర్సా యాడ్ ఆన్ గా జియో సినిమా, జియో టీవీ మరియు జియో క్లౌడ్‌తో సహా జియో సర్వీస్ కాంప్లిమెంటరీ యాక్సెస్‌ వస్తోంది. మరి మీరు ఎక్కువ రోజుల వ్యాలిడిటీ, ఎక్కువ 5జీ డేటా కావాలనుకుంటే జియో అందించే ఈ ప్లాన్ పై ఓ లుక్కేయండి.

Jojobet GirişjojobetjojobetMadridbetJojobetjojobetJojobetjojobetJojobetjojobetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişşanlıurfa haberbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet