iDreamPost
android-app
ios-app

ఎలాన్ మస్క్ vs అంబానీ.. Jio పతనమవుతుందా? అసలేంటి ఈ కొత్త వార్?

  • Published Oct 23, 2024 | 5:49 PM Updated Updated Oct 23, 2024 | 5:49 PM

Elon Musk Vs Ambani: సెంట్రల్ గవర్నమెంట్ శాటిలైట్ స్పెక్ట్రమ్ విషయంలో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ముఖేష్ అంబానికి మైనస్ గా మరగా ఎలాన్ మస్క్ కి ప్లస్ అయింది.

Elon Musk Vs Ambani: సెంట్రల్ గవర్నమెంట్ శాటిలైట్ స్పెక్ట్రమ్ విషయంలో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ముఖేష్ అంబానికి మైనస్ గా మరగా ఎలాన్ మస్క్ కి ప్లస్ అయింది.

ఎలాన్ మస్క్ vs అంబానీ.. Jio పతనమవుతుందా? అసలేంటి ఈ కొత్త వార్?

ఇండియాలో ప్రస్తుతం టాప్ లో దూసుకుపోతున్న టెలికాం కంపెనీలంటే అందరికీ వెంటనే గుర్తొచ్చే పేర్లు జియో, ఎయిర్టెల్.. ఈ రెండు ప్రైవేట్ నెట్ వర్క్ లు కూడా రికార్డు స్థాయిలో యూజర్లను కలిగి ఉన్నాయి. ఫోన్ వాడే వాళ్ళలో 70 పర్సెంట్ ఈ రెండు నెట్వర్క్ లనే వినియోగిస్తూ ఉంటారు. అంతలా ఇవి కస్టమర్లను తమ వైపు తిప్పుకున్నాయి. ముఖ్యంగా జియో .. టెలికాం రంగం రూపు రేఖలనే మార్చేసింది. జనాలకు ఇంటర్నెట్ ని నీళ్ళు తాగేంత ఈజీగా అలవాటు చేసింది జియో. టెలికాం రంగంలో ఒక కొత్త విప్లవాన్ని సృష్టించింది. మొదట్లో జనాలకు ఫ్రీగా 4 జి సేవలను అందించిన జియో ఆ తరువాత అతి తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్స్ అందించింది. 5జి సేవలను కూడా అందుబాటు ధరలోనే తీసుకొచ్చింది. జియో దెబ్బకు ఆకాశంలో కూర్చున్న ఇతర టెలికాం కంపెనీలు కిందకి దిగొచ్చాయి. జియో లాగే తమ సర్వీసుల ధరలను తగ్గించాయి. వాటి పరిస్థితి ఎలా మారిందంటే జియో తగ్గితే తగ్గాలి.. జియో పెరిగితే పెరగలి అనేలా మారింది. మీరు గమనించండి ఎయిర్టెల్ అయినా, వొడాఫోన్ అయినా జియో నిర్ణయాన్నే ఫాలో అవుతాయి. జియో రేట్లు పెంచితే ఆ కంపెనీలు కూడా రేట్లు పెంచుతాయి. ఇలా ముఖేష్ అంబానీ జియోతో భారత దేశ టెలికాం రంగాన్ని శాసిస్తున్నాడు. ఒక పక్క ప్రభుత్వ టెలికాం కంపెనీ BSNL కస్టమర్లకు తక్కువ ధరలో ప్లాన్ అందిస్తూ తన వైపు తిప్పుకుంటున్నా కూడా అంబానీ భయపడలేదు. దాని కారణం క్వాలిటి సిగ్నల్స్. జియోకి వచ్చిన వచ్చిన క్వాలిటీ సిగ్నల్స్ BSNL కి రావు. ఆ ధైర్యమే అంబానికి ఆయుధంగా మారింది. మొదట్లో జనాలకు ఫ్రీగా జియో సర్విస్ లని అలవాటు చేసిన అంబానీ ఆ తరువాత తక్కువ ధరకి, ఆ తరువాత క్రమ క్రమంగా జియో రీఛార్జ్ ధరలను పెంచుకుంటూ పోయారు. రేట్లు పెరిగాయని జనాల నుంచి వ్యతిరేకత వస్తున్న అంబానీ ఏమాత్రం అదరలేదు బెదరలేదు. కానీ ఒక్కరికీ మాత్రం ఈ అపర కుబేరుడు భయపడుతున్నాడు. ఆ ఒక్కడు ఎవరో కాదు అంబానిని మించిన అపర కుబేరుడు. ఈ ప్రపంచనికే నెంబర్ వన్ కుబేరుడు. ఎస్.. అతనే ఎలాన్ మస్క్.

ఎలాన్ మస్క్ ఇండియాలో పెట్టుబడులు పెడుతున్నాడు. ఆయన పెట్టుబడులు పెడితే అంబానికి వచ్చిన నష్టం ఏంటి అనుకునేరు. ఎందుకంటే ఎలాన్ మస్క్ ఇండియాలో పెట్టుబడులు పెట్టబోయేది టెలికాం రంగంలో. ఎస్ .. ముఖేష్ అంబానీ కింగ్ గా దూసుకుపోతున్న టెలికాం రంగంలో పెట్టుబడులు పెడుతున్నాడు. సరే ఎలాన్ మస్క్ టెలికాం రంగంలో పెట్టుబడి పెడితే ముఖేష్ అంబానికి వచ్చిన నష్టం ఏంటి? జియో దుమ్ము దులుపుతుందిగా.. అంబాని భయపడాల్సిన అవసరం ఏంటని అనుకునేరు.. కానీ దీని వెనకాల ఓ పెద్ద స్టోరీనే ఉంది. దాని గురించి ఇప్పుడు మనం డీటైల్ గా తెలుసుకుందాం. నిజానికి అంబానీ భయపడేది ఎలాన్ మస్క్ కి కాదు. శాటిలైట్ స్పెక్ట్రమ్ కి. ఇప్పుడు ఆ శాటిలైట్ స్పెక్ట్రమ్ వెనుక ఎలాన్ మస్క్ ఉన్నాడు. అసలు ఇంతకీ ఈ శాటిలైట్ స్పెక్ట్రమ్ అంటే ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మన దేశంలో ఫోన్ సర్వీసెస్ అన్నీ కూడా టవర్లు,కేబుల్స్, బూస్టర్స్ సాయంతో పని చేస్తాయని అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి టవర్లు ఎక్కువగా నగరాల్లో ఉంటాయి. కానీ మారుమూల ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ఇవి పెద్దగా ఉండవు. ఒకవేళ ఉన్నా కానీ .. మారు టెక్నికల్ సమస్యలు వల్ల సరిగ్గా పని చెయ్యవు. దానికి కారణం ఇవన్నీ కూడా భూమి మీద ఫిజికల్ గా కనెక్ట్ అయ్యాయి. అందువల్ల అన్నీ ఏరియాలో సిగ్నల్స్ సమానంగా అందవు. అందువల్ల మారు మూల ప్రాంతాల్లో, పల్లెటూర్లలో ఇంటర్నెట్ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ శాటిలైట్ స్పెక్ట్రమ్ కారణంగా అలాంటి సమస్య ఉండదు. ఎందుకంటే మన భూమి చుట్టూ ఇంటర్నెట్ సర్వీస్ చాలా క్వాలిటీగా అందించే శాటిలైట్స్ పెడతారు. వీటి వల్ల దేశంలో ఎక్కడైనా కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం పొందవచ్చు. అలాగే కాల్ సర్వీసులు, ఇతర సర్వీసులు కూడా ఎంతో మెరుగ్గా ఉంటాయి. అంటే మనకు టవర్లు, కేబుల్స్, బూస్టర్స్ సాయం లేకుండా డైరెక్ట్ గా శాటిలైట్ నుంచే ఈ హైస్పీడ్ సర్వీసులు అందుతాయి. దీనిపై ఇప్పటికే యూనియన్ కమ్యూనికేషన్స్ డిపార్ట్ మెంట్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చింది. ఈ నిర్ణయమే ఎలాన్ మస్క్ కి ప్లస్ గా మారింది. ముఖేష్ అంబానికి మైనస్ గా మారింది.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఎలాన్ మస్క్ చాలా హ్యాపీగా ఉన్నట్లు ఎక్స్ ద్వారా స్పందించాడు. అలాగే మన భారత ప్రభుత్వం తీసుకున్న ఈ డెసిషన్ కి సపోర్ట్ ఇస్తా అని తెలిపాడు. కానీ అంబానీ మాత్రం హ్యాపీగా లేడు. ఎందుకంటే సాధారణంగా ఇండియన్ గవర్నమెంట్ స్పెక్ట్రమ్ ఎలాకేషన్స్ లో ఆక్షన్ విధానాన్ని పెడుతుంది. అంటే వేలం పాట పెడుతుంది. ఆ వేలం పాటలో ఎక్కువ ధరకి పాడిన టెలికాం కంపెనీలకు ప్రభుత్వం లైసెన్స్ ఇస్తుంది. ఈ విధానాన్ని ప్రభుత్వం చాలా సంవత్సరాలుగా అమలు చేస్తుంది. అయితే ఎప్పటి లాగే ఈసారి ఈ ఆక్షన్ విధానాన్ని ఫాలో అవ్వలేదు. ఈసారి అడ్మినిస్ట్రేటివ్ విధానాన్ని ఫాలో అవుతున్నట్లు తెలిపింది. ప్రభుత్వం ఫాలో అవుతున్న ఈ విధానంలో ప్రైవేట్ టెలికాం కంపెనీలకు మధ్య ఎలాంటి పోటీ ఉండదు. కేవలం ప్రభుత్వం ఫిక్స్ చేసిన బడ్జెట్, కండిషన్స్ కి ఓకే అనుకునే కంపెనీలకు మాత్రమే ప్రభుత్వం లైసెన్స్ ఇస్తుంది. కానీ ఇందులో ఉండే కండిషన్స్ ప్రైవేట్ టెలికాం కంపెనీలకు అనుకూలంగా లేవు. ముఖ్యంగా టాప్ 2 లో దూసుకుపోతున్న జియో, ఎయిర్టెల్ కంపెనీలకు ఈ విధానం నచ్చలేదు. వీటి వల్ల తమకు పోటీ ఉండదు. అందువల్ల ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ముఖేష్ అంబానీకి కూడా ఈ నిర్ణయం నచ్చలేదు. కానీ ఎలాన్ మస్క్ కి నచ్చింది. అందుకే ఈ శాటిలైట్ స్పెక్ట్రమ్ అమలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తన కంపెనీ Space X సాయంతో అంతరిక్షంలో భూమి చుట్టూ శాటిలైట్స్ పెట్టగల సత్తా ఎలాన్ మస్క్ కి ఉంది. తన Starlink కంపెనీ సాయంతో భారత దేశ ప్రజలకు మంచి టెలికాం సర్వీస్ లను అందించగలనని ఎలాన్ మస్క్ తెలిపారు.

అసలు ప్రభుత్వం ఈ ఆక్షన్ లో అడ్మినిస్ట్రేటివ్ మెథడ్ ఫాలో అవ్వడానికి ఓ బలమైన కారణం ఉంది. అదే ఇంటర్నేషనల్ టెలి కమ్యూనికేషన్స్ యూనియన్ (ITU). ఈ ITU సంస్థ శాటిలైట్ స్పెక్ట్రమ్ పనులు చూసుకుంటుంటుంది. ఈ సంస్థలో చాలా దేశాలు ఉన్నాయి. అందులో మన దేశం కూడా ఉంది. ఈ సంస్థ పెట్టిన రూల్స్ ని దీని కింద ఉన్న దేశాలు కచ్చితంగా ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ లో భాగంగా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఎలాన్ మస్క్ కి ప్లస్ గా మారగా, అంబానికి మైనస్ గా మారింది. ఇదీ సంగతి. కానీ ఎలాన్ మస్క్ ఇండియాలో టెలికాం కంపెనీ పెట్టాక రీచార్జ్ ప్లాన్ ధరలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. లేదంటే ఆయనకి కూడా భారీ నష్టాలు తప్పవు. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.