iDreamPost
android-app
ios-app

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు – విచిత్రమైన పొత్తులు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు – విచిత్రమైన పొత్తులు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో వివాదాలతోపాటు విచిత్ర పరిస్థితులు కూడా కనిపించాయి. రెండు పరస్పర విరుద్ధ భావాలు కలిగి దేశవ్యాప్తంగా తీవ్ర విబేధాలు కలిగి ఉన్న భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కొన్నిచోట్ల కలిసిపోయాయి.. జాతీయస్థాయి మాదిరిగానే తెలంగాణలోనూ నువ్వా నేనా అనే రేంజ్‌లో రాజకీయంగా పొట్లాడుకున్నాయి. అయితే, శ్రతువుకు శత్రువు మిత్రుడు అనే సూత్రాన్ని అనుసరించాయి. మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసిపోయి అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇస్తున్నాయి..

మణికొండ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తిస్థాయిలో మెజార్టీ రాలేదు. దీంతో బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అలాగే మక్తల్‌లోనూ సేమ్ సీన్ రిపీటయ్యింది. మణికొండలో హస్తానికి కమలం పార్టీ మద్దతిస్తే.. మక్తల్‌లో కమలానికి కాంగ్రెస్ మద్దతిచ్చింది. రాజకీయంగా తీవ్ర విభేదాలు ఉన్న రెండు పార్టీలు కలిసి ఓ ప్రాంతీయ పార్టీకి షాక్ ఇచ్చాయి. అంటే ఇక్కడ ఉమ్మడి శత్రువు ని దెబ్బ కొట్టాలంటే ఉంటూనే మీరు ఈ మాదిరిగా పని చేసినట్లు స్పష్టమవుతోంది.

Read Also: తెలంగాణ మున్సిపాలిటీ నూతన పాలక వర్గాలు

మరోవైపు దీనిపై టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు సిగ్గులేదు.. వాళ్లు ఎట్ల కలుస్తరు.. మక్తల్​లో బీజేపీకి కాంగ్రెస్​ సపోర్టు చేస్తె.. మణికొండలో కాంగ్రెస్​కు బీజేపీ మద్దతు ఇచ్చింది. పేరుకే ఢిల్లీ పార్టీలు, చేసేవన్నీ సిల్లీ పనులే..” అని టీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్​ విమర్శించారు. అంతేకాదు.. ఆ రెండుపార్టీలు కుమ్మక్కయ్యాయని తాను ఎన్నికల ప్రచార సమయంలోనే చెప్పానని, ఇప్పుడు నిజమైందన్నారు. మున్సిపల్ చైర్మన్ పదవికోసం ఆ రెండు జాతీయపార్టీలు కలిసిపోయాయని పేర్కొన్నారు.

Read Also: కారు కింద కాంగ్రెస్‌, బీజేపీ ప‌చ్చ‌డి

మాజీమంత్రి డీకే అరుణ మాట్లాడుతూ మక్తల్ లో బీజేపీకి గట్టి పట్టుఉందని, అందుకే మక్తల్ మున్సిపల్‌ చైర్మన్‌ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుందని తెలిపారు. రాష‍్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వారు మున్సిపల్‌ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవడం సహజమని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ మున్సిపల్‌ ఎన్నికల ముందు బీజేపీ గెలిచే స్థానాల్లో ముస్లింల ఓట్లకోసం ఎన్‌ఆర్‌సీ, సీఏఏల పేరు తప్పుడు ప్రచారం చేసారని మండిపడ్డారు. మక్తల్ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా బి.పావని, వైస్ ఛైర్‌పర్సన్‌గా అఖిలలు ప్రమాణ స్వీకారం చేశారు.