iDreamPost
android-app
ios-app

కల్నల్‌ సంతోష్‌బాబు భార్యకు ఉద్యోగ పత్రం.. సూర్యాపేట వెళ్లి ఇవ్వనున్న కేసీఆర్‌

కల్నల్‌ సంతోష్‌బాబు భార్యకు ఉద్యోగ పత్రం.. సూర్యాపేట వెళ్లి ఇవ్వనున్న కేసీఆర్‌

చైనా సరిహద్దులోని గాల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన సూర్యాపేటకు చెందిన కల్నల్‌ సంతోష్‌బాబు భార్యను తెలంగాణ ప్రభుత్వం ఆర్డీవోగా నియమించనుంది. ఈ మేరకు ఇప్పటికే హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్‌.. ఉద్యోగ నియామక పత్రాన్ని స్వయంగా ఆయనే అంది^è నున్నారు. ఈ రోజు సూర్యపేట వెళుతున్న సీఎం కేసీఆర్‌ కల్నల్‌ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఆ తర్వాత తాను ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ నియామక పత్రంతోపాటు 5 కోట్ల రూపాయల చెక్, హైదరాబాద్‌ షేక్‌పేటలో 500 గజాల ఇంటి స్థలం పత్రాలు అందించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటనకు అవసరమైన ఏర్పాట్లను సూర్యపేట జిల్లా అధికారులు పూర్తి చేశారు.

గాల్వాన్‌ లోయలో సరిహద్దు వద్ద చైనా బలగాలతో చెలరేగిన ఘర్షణలో మన దేశానికి చెందిన కల్నల్‌ సంతోష్‌బాబుతోపాటు మరో 19 మంది సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 19 మంది సైనికులకు కూడా తెలంగాణ సీఎం కేసీఆర్‌ 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారు. ఆ మేరకు సదరు మొత్తాన్ని దేశ రక్షణ శాఖ మంత్రి ద్వారా అసువులు బాసిన సైనికుల కుటుంబాలకు అందించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను కూడా తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది. దేశ రక్షణలో ప్రాణాలర్పించిన సైనికులకు అండగా ఉండాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న సీఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈ ఆర్థిక సహాయం చేస్తున్నారు.