iDreamPost
android-app
ios-app

టిడిపి మాజీ ఎమ్మెల్యే బుజ్జి హఠాన్మరణం

  • Published Dec 26, 2019 | 2:34 AM Updated Updated Dec 26, 2019 | 2:34 AM
  • Published Dec 26, 2019 | 2:34 AMUpdated Dec 26, 2019 | 2:34 AM
టిడిపి మాజీ ఎమ్మెల్యే బుజ్జి హఠాన్మరణం

పశ్చిమగోదావరి జిల్లా తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి (55) మృతి చెందారు. గురువారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో గుండెపోటు రావటంతో కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు నిర్థరించారు.

2014 నుంచి 2019 మధ్య కాలంలో బుజ్జి ఏలూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. గతంలో మున్సిపల్ కౌన్సిలర్‌గా, ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. సుదీర్ఘకాలం పాటు తెదేపాలోనే కొనసాగారు. బుజ్జికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

2009లో మెగాస్టార్‌ చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించిన సమయంలో ఆ పార్టీలోకి వెళ్లి ఎమ్యెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. మళ్లీ తెదేపా గూటికే చేరారు. బడేటి కోట రామారావు (బుజ్జి) దివంగత సినీ నటుడు ఎస్వీ రంగారావు మేనల్లుడు.

Jojobet GirişJojobetşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobet güncel girişgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom