Idream media
Idream media
మొత్తానికి ఏ అంశమైనా, ఏ వ్యవహారమైనా రాజకీయం ఉండాల్సిందే. చీమ చిటుక్కుమన్నా అందులో రాజకీయ కోణాన్ని, తనకొచ్చే ప్రయోజనాన్ని ఆలోచించే నిర్ణయం తీసుకునే చంద్రబాబు మరోమారు తన మార్క్ నిర్ణయాన్ని ప్రకటించారు. విశాఖలో గ్యాస్ లీక్ ఘటన మీద వాస్తవాలను తెలుసుకుని పార్టీ అధిష్టానానికి నివేదించాల్సిందిగా ఆదేశిస్తూ ముగ్గురు ఎమ్మెల్యేలతో చంద్రబాబు ఓ కమిటీ వేశారు.అందులో ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామానాయుడు, చినరాజప్పలను నియమించారు. వాస్తవానికి ఈ ముగ్గురిలో ఎవరూ ఈ ప్రమాదం జరిగిన ప్రాంతానికి చిరపరిచితులు కారు. దానికితోడు ఇక్కడి ప్రజలకు పూర్తిగా తెలియని మొఖాలే. మరి వాళ్ళతో ఎందుకు కమిటీ వేశారో అర్థం కావడం లేదని కార్యకర్తలు అంటున్నారు.
వాస్తవానికి ఆ ప్రమాద ఘటన జరిగిన వెంటనే అక్కడికి వెళ్లిన సహాయక చర్యలను పర్యవేక్షించిన విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబును కదా కమిటీలో వేయాల్సింది. ఆయానైతే ఇక్కడి ప్రజలకు పూర్తిగా తెలిసిన వారు. అంతేకాకుండా నందమూరినగర్, వెంకటాపురం తదితర ప్రభావిత ప్రాంతాలన్నీ ఈయన నియోజకవర్గంలోనే ఉన్నాయి. సదరు ఎల్జీ పాలిమర్స్ కు ఏయే గ్రామాలు, ఎంత దూరంలో ఉన్నాయి, ఎంతెంత ప్రభావానికి గురయ్యాయి అన్నది ఈయనకు ఖచ్చితంగా తెలుస్తుంది. పాతికెళ్లుగా ఈ ఏరియాతో, ఇక్కడి ప్రజలతో కలిసి ఉంటున్న గణబాబును కమిటీలో వేయకుండా వేరే జిల్లాల నుంచి తీసుకొచ్చిన ఎమ్మెల్యేలు ఇకాఫీకి వచ్చి ఎక్కడికి వెళ్లగలరని, ఏమి వివరాలు తెలుసుకోగలరని బాధితులు అంటున్నారు.
ఓహో అందుకే తప్పించారా ??
వాస్తవానికి చబద్రబాబుకు తనకన్నా ఎవరూ తెలివైనోళ్లు లేరన్నది ఓ బలమైన నమ్మకం. తనను కాకుండా వేరే వారిని గుర్తించినా, వారి సమర్త్యాన్ని కొనియాడిినా చంద్రబాబు భరించలేరు . సరిగ్గా ఈ పాయింట్ మీదనే గణబాబుకు దెబ్బకొట్టారని అంటున్నారు. వాస్తవానికి ప్రమాదం జరగ్గానే కాసేపటికి గణబాబు ఈ ప్రాంతానికి వచ్చారు. అప్పటికే పోలీసులు, అంబులెన్స్ లు , ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది బాధితులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఎక్కడ చూసినా బాధితులను మోసుకెళ్తున్న సిబ్బంది కనిపిస్తున్నారు.
వాస్తవాన్ని గ్రహించిన గణబాబు ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం బాగా పని చేసిందని, వెనువెంటనే పోలీసులు,వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేసారని కొనియాడారు. అనంతరం ముఖ్యమంత్రి అధికారులు, ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసిన సమీక్షకు కూడా హాజరై ఆ ప్రాంత ప్రజల తరఫున తన వాణి వినిపించి పలు అంశాలను ముఖ్యమంత్రి, అధికారుల దృష్టికి తెచ్చారు.
ఇదే సరిగ్గా చంద్రబాబు పట్టుకున్నారు. అసలు ప్రభుత్వ యంత్రాంగాన్నీ తన పార్టీ ఎమ్మెల్యే మెచ్చుకోవడం,ఇంకా సీఎం నిర్వహించిన రివ్యూలో మాట్లాడడం బాబుకు నచ్చలేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, వీలైనంతవరకు ఇరుకున పెట్టాడా కదా మనోళ్లు చేయాలి. మరి మెచ్చుకోవడం ఏమిటి ?అని అసూయ చెందిన చంద్రబాబు గణబాబు ఆ కమిటీలో వేయకుండా పక్కనబెట్టినట్లు తెలిసింది. తన నియోజకవర్గంలో ప్రమాదం జరిగితే, ఇక్కడి కష్ట నష్టాలు తనకు తెలుస్తాయి తప్ప వేరే జిల్లాల ఎమ్మెల్యేలకు ఎలా తెలుస్తుంది..ఇలాంటి సమయాల్లోనూ చిల్లర రాజకీయాలు చేస్తే ఎలా? అని గణబాబు మథనపడుతున్నట్లు తెలిసింది..