iDreamPost
android-app
ios-app

దళిత మహిళ వండిన ఆహారం తినని విద్యార్థులు! రంగంలోకి కలెక్టర్!

దళిత మహిళ వండిన ఆహారం తినని విద్యార్థులు! రంగంలోకి కలెక్టర్!

నేటి సమాజం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందింది. ఇదే సమయంలో అన్ని వర్గాల వారు.. అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నారు. ఉన్నత వర్గాలు, దళిత వర్గాలు అంటూ తేడా లేకుండా.. అందరూ కలిసి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే ఇలాంటి ఆధునిక యుగంలో కూడా ఇంకా దళితులు పలు ప్రాంతాల్లో అవమానాలకు గురవుతున్నారు. దళిత కోసం ఎన్ని చట్టాలు చేసినా కూడా కొన్ని ప్రాంతాల్లో వారికి దక్కాల్సిన గౌవరం దక్కడం లేదు. ఇంకా వారిని చిన్చూపు చూస్తే ఉన్నారు. వారి పక్కన కూర్చొకపోవడం, గ్రామాలకు దూరంగా వారిని ఉంచడం వంటివి చేస్తున్నారు. తాజాగా ఓ దళిత మహిళ వండిన ఆహారం తినడానికి విద్యార్థులు నిరాకరించారు. దీంతో జిల్లా కలెక్టర్ ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మారిపోయింది. ఈ ఘటన తమిళనాడు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

తమిళనాడులోని కరూర్ జిల్లాలో వేలన్ చెట్టియార్ పంచాయతీలోని ఓ పాఠశాలలో 30 విద్యార్థులు చదువుకుంటున్నారు. అక్కడ నిత్యం భోజనాలు పెడుతుండేవారు. ఆ పాఠశాలలో చదువుతున్న 30 మంది విద్యార్థుల్లో 15 మంది.. అక్కడ భోజనం చేయడం లేదు. టీచర్లు ఎంత చెప్పిన భోజనం చేసేందుకు నిరాకరించినట్లు సమాచారం. దళితురాలైన సుమతి అనే మహిళ వండినందుకే.. ఆ ఆహారాన్ని తినడానికి వారు నిరాకరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమస్యపై స్కూల్ ఉపాధ్యాయులు జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు.

వెంటనే స్పందించిన ఆయన.. పాఠశాలను సందర్శఇంచారు. అక్కడ తొలుత విద్యార్థులను ఆహారానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుకున్నారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి.. వారికి గట్టి హెచ్చరికలు జారీ చేశాడు. విద్యార్థులకు కులమత బేధాలు వంటివి నేర్పించ వద్దని హితబోధ చేశారని సమాచారం. అలానే ఇలా దళితులను అవమానించేలా చేస్తే.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ  నిరోధక చట్టం కింద చట్ట పరమైన  చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అల్పాహార పథకాన్ని పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ హిందూ విద్యార్ధుల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. దళిత మహిళ ఆహారాన్ని తయారు చేయడాన్ని ఓ విద్యార్ధి పేరెంట్స్ తప్పు పట్టారు.

ఆమె వండితే తమ బిడ్డ ఆహారం తినదని చెప్పారు. వారిపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఆ పాఠశాలలో అల్పాహార పథకాన్ని పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ విద్యార్ధుల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. వారికి పలు సూచనలు చేశారు. ఇటీవలే తమిళనాడు సీఎం స్టాలిన్.. ప్రభుత్వ పాఠశాలల్లో అల్పహారం పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లోని 15.75లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా అల్పహారాన్ని స్టాలిన్ ప్రభుత్వం అందిస్తోంది. మరి.. తమిళనాడులో జరిగిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి