సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు..బయటపడ్డ సంచలన వాస్తవాలు!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించిన రెండేళ్ల తర్వాత నేడు సంచలన నిజం బయటపడింది. సుశాంత్ ని పోస్ట్‌మార్టం నిర్వహించిన బృందంలో భాగమైన కూపర్ హాస్పిటల్ ఉద్యోగి రూప్‌కుమార్ షా సంచలన వాస్తవాలను బయట పెట్టారు.. “సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదు హత్య చేయబడ్డాడు” అని వెల్లడించారు.

రూప్‌కుమార్ షా మాట్లాడుతూ, “సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించినప్పుడు, మాకు పోస్ట్‌మార్టం కోసం కూపర్ ఆసుపత్రిలో ఐదు మృతదేహాలు వచ్చాయి, మేము పోస్ట్‌మార్టం చేయడానికి వెళ్ళినప్పుడు, ఐదు మృతదేహాలలో ఒకటి సుశాంత్ ది అని మాకు తెలిసింది. సుశాంత్ మరియు అతని శరీరంపై అనేక గుర్తులు మరియు అతని మెడపై రెండు నుండి మూడు గాయాలు కూడా ఉన్నాయి.

జూన్ 14, 2020న సుశాంత్ బాంద్రాలోని తన నివాసంలో ఉరివేసుకుని కనిపించాడు. అతడిని హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోజే అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఇంత కాలం గడిచినా అతని మరణం అంతుపట్టని మిస్టరీగా మిగిలిపోయింది.

నటుడు అమీర్ ఖాన్ సోదరుడు ఫైసల్ ఖాన్ కూడా ఇంతకుముందు కూడా ఇదే వాదన చేశాడు. సుశాంత్ హత్య చేయబడ్డాడని నాకు తెలుసు. సుశాంత్ మృతిపై ఉన్న నిజానిజాలు బయటకి వస్తాయా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఇందులో చాలా ఏజెన్సీలు (CBI, ED, NCB) ఉన్నాయి. విచారణ సాగుతోంది. కొన్నిసార్లు కొందరి వల్ల ఎప్పటికి నిజం బయటకు రాదు.కానీ సుశాంత్ డెత్ మిస్టరీ మాత్రం తప్పకుండా బయటకి రావాలని ప్రార్థిస్తున్నానని ఫైసల్ ఖాన్ వెల్లడించారు.

ఎప్పుడూ నవ్వుతూ కనపడే సుశాంత్, తన మరణంతో అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మరియు అతని అకాల మరణానికి ఇప్పటికీ న్యాయం కోరుతూ ఉన్న అభిమానులకు ఎంతగానో దుఃఖాన్ని మిగిల్చి వెళ్లారు.

Show comments