iDreamPost
android-app
ios-app

సుశాంత్ సింగ్ ఇల్లు కొంటున్న వార్తలపై స్పందించిన ఆదా శర్మ

  • Published Apr 06, 2024 | 2:35 PM Updated Updated Apr 06, 2024 | 2:35 PM

ది కేరళ స్టోరీ చిత్రంతో క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ ఆదా శర్మ. ప్రస్తుతం ఆమె లేడీ అండ్ కాంట్రవర్షియల్ సబ్జెక్టులకు కేరాఫ్ అడ్రస్ అయ్యింది. బస్తర్ నక్సల్స్ స్టోరీ ఇటీవల విడుదలై.. డిజాస్టర్ అయ్యింది. తాజాాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది.

ది కేరళ స్టోరీ చిత్రంతో క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ ఆదా శర్మ. ప్రస్తుతం ఆమె లేడీ అండ్ కాంట్రవర్షియల్ సబ్జెక్టులకు కేరాఫ్ అడ్రస్ అయ్యింది. బస్తర్ నక్సల్స్ స్టోరీ ఇటీవల విడుదలై.. డిజాస్టర్ అయ్యింది. తాజాాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది.

  • Published Apr 06, 2024 | 2:35 PMUpdated Apr 06, 2024 | 2:35 PM
సుశాంత్ సింగ్ ఇల్లు కొంటున్న వార్తలపై స్పందించిన ఆదా శర్మ

టాలీవుడ్ డ్రీమ్ బాయ్ ఉదయ్ కిరణ్ ఆత్మహత్యను తెలుగు ప్రేక్షకులు ఎలా మర్చిపోలేరో.. బాలీవుడ్‌లో కూడా యంగ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ సూసైడ్ విషయాన్ని కూడా ఇంకా జీర్ణించుకోలేదు సినీ ప్రేక్షకులు. ఇతడిది హత్య అని, ఆత్మహత్యేనని కొంత మంది డిస్కస్ చేస్తూ ఉంటారు. బీటౌన్‌లో నెపోటిజం కారణంగానే ఈ ధోనీ యాక్టర్ బలవన్మరణానికి పాల్పడ్డాడని మరో రకం వాదన కూడా వినిపిస్తూ ఉంటుంది. ఏదీ ఏమైనప్పటికీ.. ఓ మంచి యాక్టర్ ఇండస్ట్రీకి దూరమయ్యాడనేది మాత్రం నిజం. అయితే ఈ నటుడు ఆత్మహత్య చేసుకున్న ఫ్లాట్‌ను ప్రముఖ నటి కొన్నారన్న వార్త ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. దీనిపై ఆ నటి స్పందించింది.

ఇంతకు ఆ ఫ్లాట్ కొంటున్నట్లు వార్తలు వస్తున్న నటి.. ది కేరళ స్టోరీ బ్యూటీ ఆదా శర్మ. ఇటీవల యూట్యూబర్ సిద్దార్థ్ కానన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆదా.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించిన ఫ్లాట్ కొనుగోలుపై స్పందించింది. ‘ ప్రస్తుతం నేను అందరి హృదయాల్లో న్నారు. దీని గురించి మాట్లాడేందుకు ఓ సరైన సమయం ఉంది అనుకుంటున్నా. నేను ఎప్పుడైతే సుశాంత్ మరణించిన ఫ్లాట్ చూడటానికి వెళ్లానో.. మీడియా అటెన్షన్ మొత్తం నాపై పెట్టింది. నేను ప్రైవేట్ పర్సన్‌ని. నా సినిమాల కోసం ప్రజల దృష్టిలో ఉండాలనుకుంటున్నాను కానీ, వ్యక్తిగత విషయాల వల్ల కాదు’ అంటూ చెప్పుకొచ్చింది. అతని అపార్ట్ మెంట్ అమ్మకం ఉన్నట్లు ఆన్ లైన్లలో చూసి దిగ్బ్రాంతిని వ్యక్తం చేసినట్లు తెలిపింది.

అలాగే ‘మన మధ్యలో లేని వారి గురించి మాట్లాడటం తప్పు. అతడు చాలా గౌరవం ఉన్న నటుడు. కొంత మంది వ్యక్తులు చేస్తున్న వ్యాఖ్యలు నాకు నచ్చడం లేదు. ఆయన గురించి కొంత మంది చేస్తున్న కామెంట్స్ కూడా చదివాను. నన్ను ట్రోల్ చేయొచ్చు. కానీ మన మధ్య లేని వ్యక్తుల గురించి ట్రోల్ చేయొద్దు. నేను ఎక్కడ జీవిస్తున్నాను అనే విషయంలో తర్వలోనే వెళ్లడిస్తాను. కానీ ప్రస్తుతం ఎటువంటి అద్దె చెల్లించకుండా లక్షలాది మంది ప్రజల హృదయాల్లో నివసిస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ. ది కేరళ స్టోరీతో అలరించిన బ్యూటీ.. మరో వివాదాస్పద మూవీతో ముందుకు వచ్చింది. బస్తర్ ది నక్సల్స్ స్టోరీ మార్చి 15న థియేటర్లలో విడుదల కాగా, డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం.. ఆమె ద గేమ్ ఆప్ గిర్జిత్ అనే చిత్రంలో నటించబోతుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetparibu girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş