iDreamPost
android-app
ios-app

కృతి సనన్‌ మనసులో ఏముంది?.. ఆ పేరుతో మాజీ లవర్‌కు సంబంధం ఏంటి?

  • Published Jul 05, 2023 | 6:53 PM Updated Updated Jul 05, 2023 | 6:53 PM
  • Published Jul 05, 2023 | 6:53 PMUpdated Jul 05, 2023 | 6:53 PM
కృతి సనన్‌ మనసులో ఏముంది?.. ఆ పేరుతో మాజీ లవర్‌కు సంబంధం ఏంటి?

ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్‌ కృతి సనన్‌ సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఆమె ‘‘ బ్లూ బట్టర్‌ ఫ్లై ఫిల్మ్స్‌’’ పేరిట ఓ ప్రొడక్షన్‌ హౌస్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రొడక్షన్‌ హౌస్‌ ద్వారా త్వరలో చిన్న నుంచి మీడియం బడ్జెట్‌ సినిమాలను తెరకెక్కించనున్నారు. కాజోల్‌ హీరోయిన్‌గా కృతి సనన్‌ నిర్మాణ సంస్థలో మొదటి సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇక, ‘‘ బ్లూ బట్టర్‌ ఫ్లై ఫిల్మ్స్‌’’ ఏర్పాటుపై కృతి సనన్‌కు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్‌ మీడియాలో ‘‘ బ్లూ బట్టర్‌ ఫ్లై ఫిల్మ్స్‌’’ పేరుపై పెద్ద చర్చ మొదలైంది.

‘‘ బ్లూ బట్టర్‌ ఫ్లై ఫిల్మ్స్‌’’ పేరుకు దివంగత బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌కు సంబంధం ఉందని నెటిజన్లు అంటున్నారు. ఇందుకు కొన్ని ఆధారాలు కూడా చూపిస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌, కృతి సనన్‌లు 2017లో వచ్చిన ‘రాబ్తా’ అనే సినిమాలో కలిసి నటించారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్యా ప్రేమ చిగురించిందని సమాచారం. తర్వాత ఓ సంవత్సర కాలం పాటు ఇద్దరూ కలిసి తిరిగారు. అయితే, 2018లో ఇ‍ద్దరూ విడిపోయారు. తమ కెరీర్ల మీద దృష్టి పెట్టడానికి ఇద్దరూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక, ఆ తర్వాతి నుంచి ఇద్దరి గురించి ఎలాంటి పుకార్లు రాలేదు. తర్వాత సుశాంత్‌.. రియా చక్రవర్తితో ప్రేమలో పడ్డారు. 2020లో వ్యక్తిగత కారణాల వల్ల సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నారు. సుశాంత్‌ చనిపోయినపుడు కృతి సనన్‌ చాలా ఎమోషనల్‌ అయ్యారు. తర్వాత చాలా సందర్భాల్లో తన మాజీ ‍ప్రియుడ్ని గుర్తు చేసుకుంటూ వచ్చారు. సుశాంత్‌కు సీతాకోక చిలుకలు అంటే చాలా ఇష్టం. ఆ విషయాన్ని చాలా సందర్భాల్లో ఆయన చెప్పుకొచ్చారు. అందుకే తన ప్రొడక్షన్‌ హౌస్‌కు బట్టర్‌ ఫ్లై అని వచ్చేలా పేరు పెట్టినట్లు నెటిజన్లు భావిస్తున్నారు. ఈ వార్తల్లో నిజం ఎంతుందో కృతి సనన్‌కే తెలియాలి.

Blue butterfly films…kriti’s ode to Sushant 💔💙
by u/ditoxit1 in BollyBlindsNGossip

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom