iDreamPost
iDreamPost
ఆర్ఆర్ఆర్ వచ్చి నాలుగు నెలలు దాటేసింది. సోషల్ మీడియాలో విదేశీయుల ట్వీట్లతోనో ఆస్కార్ గురించిన చర్చలతోనో ఏదో ఒక రూపంలో నానుతూనే ఉంది కానీ రాజమౌళితో సహా దానికి సంబంధించిన వాళ్ళందరూ ఎవరి ప్రోజెక్టులతో వాళ్ళు బిజీ అయిపోయారు. రామ్ చరణ్ నాన్ స్టాప్ గా శంకర్ మూవీలో పాల్గొంటున్నాడు. ఆ మధ్య కొంచెం బ్రేక్ ఇచ్చారు కానీ తిరిగి మళ్ళీ కంటిన్యూ చేయబోతున్నారు. ఇండియన్ 2తో పాటు దీన్ని ఒకేసారి హ్యాండిల్ చేస్తున్న శంకర్ 2023 వేసవికి చరణ్ 15ని విడుదల చేసేలా ప్లాన్ సెట్ చేశారు. ఏవైనా అనూహ్య పరిస్థితులు ఏర్పడితే తప్ప మార్పు ఉండదు. ఇక జక్కన్న మహేష్ ల సినిమా గురించి తెలిసిందే.
ఎటొచ్చి జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇంకా మౌనంగా ఉన్నాడు. కొరటాల శివతో ప్యాన్ ఇండియా మూవీ లాక్ చేశాక త్వరలోనే శూవుటింగ్ మొదలవుతుందని ఫ్యాన్స్ ఎదురు చూశారు. కానీ ఆచార్య నష్టాల తాలూకు సెటిల్ మెంట్ల కోసం చాలా టైం ఖర్చు పెట్టాల్సిన వచ్చిన శివ ఈ స్క్రిప్ట్ మీద పూర్తి స్థాయి ఫోకస్ పెట్టలేకపోయారు. ఆదయ్యాక రెండు మూడు వెర్షన్లు తారక్ ని కన్విన్స్ చేసేలా చెప్పలేకపోయారని లేటెస్ట్ అప్ డేట్. ఇంకా బెటర్ గా జూనియర్ ఆశిస్తున్నాడని దాని వల్లే మరికొంత ఆలస్యం తప్పదని ఇన్ సైడ్ టాక్. దసరాకు స్టార్ట్ చేస్తారేమో అనుకుంటే ఆ సూచనలు కనిపించడం లేదు. నిజంగా ఇది ఉంటుందా లేక ఏదైనా ట్విస్టు ఇస్తారా అంతు చిక్కడం లేదు.
ఆర్ఆర్ఆర్ వల్ల వచ్చిన అంతర్జాతీయ గుర్తింపు కాపాడుకునే ఒత్తిడి జూనియర్ ఎన్టీఆర్ మీద ఉంది. ఏ మాత్రం తప్పటడుగు వేసినా ఎక్కువ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. రెగ్యులర్ కమర్షియల్ కథల జోలికి వెళ్ళలేడు. అలా అని కేవలం ప్రయోగాలు చేస్తామన్నా కుదరదు. అన్నీ బ్యాలన్స్ చేసుకుంటూనే అన్ని రాష్ట్రాల ఆడియన్స్ ని మెప్పించాల్సి ఉంటుంది. పవర్ ఫుల్ బ్యాక్ డ్రాపే తీసుకున్న కొరటాల ఇంత అనుభవముండి ఎందుకు మెప్పించలేకపోతున్నాడనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒక డిజాస్టర్ తో ఏ దర్శకుడి కెపాసిటీ మీద అంచనాలు తగ్గించుకోలేం కానీ వీలైనంత త్వరగా దీన్ని పట్టాలు ఎక్కిస్తే ఫ్యాన్స్ రిలీఫ్ ఫీలవుతారు. అప్పటిదాకా టెన్షన్ తప్పదు